తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పంజా విసురుతోంది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు భారీగా కమ్మేయడంతో వాహనదారులు రహదారులు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి గజగజా వణికిస్తోంది. ఉత్తరాంధ్రలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో 11 డిగ్రీల లోపే టెంపరేచర్ ఉంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లినవారు నగరానికి తిరుగు ప్రయాణమైన క్రమంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలోనూ శనివారం చలి పంజా విసిరింది. ఒకవైపు చలి తీవ్రత.. మరోవైపు పొగమంచుతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలు, మన్యం ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అరకులో 4, మినుములూరులో 5, పెదబయలులో 6.7.. జీకేవీధి, ముంచంగిపుట్టులో 6.8, పాడేరులో 7, జి.మాడుగులలో 7.3, హుకుంపేటలో 8.6, చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో వాహనదారులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. వాహనదారులు ఫాగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటంలేదు. మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది.
మరిన్ని వీడియోల కోసం :