Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ ప్రపంచంలో ఏ కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తాను ఎలా ఉన్నా తన బిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి తల్లీ ఆలోచిస్తుంది.
ఈ ప్రపంచంలో ఏ కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తాను ఎలా ఉన్నా తన బిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి తల్లీ ఆలోచిస్తుంది. బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా వెళుతుంది.. ఎవరితోనైనా పోరాడుతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు పశుపక్ష్యాదుల్లోనూ ఉంటుంది. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోడి తన పిల్లలను తీసుకొని షెడ్డు నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఓ శునకం కోడి పిల్లలపైకి దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన తల్లి కోడి ఆ శునకంపైకి దాడి చేసింది. శునకాన్ని తరిమి, తరిమి ఉరికించింది. తన పిల్లలు సేఫ్ అనుకునేంత దూరం వరకు కుక్కను తరిమి కొట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సూపర్ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! వీడియో
Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో