నడిరోడ్డుపై పడగవిప్పి అడ్డంగా నిల్చున్న నాగుపాము.. భారీగా ట్రాఫిక్ జామ్..

|

Jan 07, 2023 | 9:37 AM

నడిరోడ్డుపై ఓ నాగుపాము పడగవిప్పి బుసకొట్టింది. అర గంట పాటు ఎక్కడి వారిని అక్కడే ఆపేసింది. జనం అలికిడి విన్నా.. అదరలేదు, బెదరలేదు. అలాగే ఉండిపోయింది.

నడిరోడ్డుపై ఓ నాగుపాము పడగవిప్పి బుసకొట్టింది. అర గంట పాటు ఎక్కడి వారిని అక్కడే ఆపేసింది. జనం అలికిడి విన్నా.. అదరలేదు, బెదరలేదు. అలాగే ఉండిపోయింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా దోర్నాల – మార్కాపురం ప్రధాన రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. శ్రీశైలం సమీపంలోని నల్లమల అడవుల్లో తాచుపాములు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడూ రోడ్ల వెంట వాహనదారులకు తారసపడుతుంటాయి. అయితే, ఇలా పడగవిప్పి రోడ్డుపైనే తిష్టవేయడం మాత్రం ఇదే తొలిసారి. చంద్రగ్రహణం విడుపు సమయంలో నాగుపాము ఇలా పడగవిప్పి రోడ్డుకు అడ్డంగా ఉండటంపై చర్చనీయాంశంగా మారింది. దోర్నాల సమీపంలోని పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద నాగుపాము నడిరోడ్డుపై పడగ విప్పింది. వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే బుసలు కొట్టింది. అర గంట తర్వాత ఆ సర్పం అడవి దారి పట్టగా.. కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. అయితే గతంలో జరిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెడిసి కొట్టిన వధూవరుల రొమాంటిక్‌ సీన్‌ !! నెట్టింట వైరల్

NTR ఘనతను.. ఎందుకు గుర్తించట్లేదు.. మంచు లక్ష్మీ సూటి ప్రశ్న..

Waltair Veerayya Trailer: ట్రైలర్ లోడింగ్ !! పూనకాలు కమింగ్ !!

Ajith: ఫిల్మ్ హిస్టరీలోనే.. ఆ లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క హీరో..

వారసుడుకు బిగ్‌ షాక్ !! విషాదంలో టీం.. అసలు ఏం జరిగిందంటే ??

 

Published on: Jan 07, 2023 09:37 AM