Snake: జెడ్పీ స్కూల్‌లోకి తాచుపాము.. పరుగో పరుగు.! వైరల్ అవుతున్న వీడియో..
స్కూల్ లో పాము హల్చల్ చేసింది. పామును సేఫ్ గా పట్టుకున్న స్నేక్ క్యాచర్ నుంచి పాఠాలు నేర్చుకున్నారు స్టూడెంట్స్. కోనసీమ జిల్లా ముమ్మిడివరం జెడ్పీ స్కూల్‌లోకి తాచుపాము చొరబడింది.
స్కూల్ లో పాము హల్చల్ చేసింది. పామును సేఫ్ గా పట్టుకున్న స్నేక్ క్యాచర్ నుంచి పాఠాలు నేర్చుకున్నారు స్టూడెంట్స్. కోనసీమ జిల్లా ముమ్మిడివరం జెడ్పీ స్కూల్‌లోకి తాచుపాము చొరబడింది. దీంతో ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు టీచర్స్, స్టూడెంట్స్. వెంటనే లోకల్‌గా ఉండే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు కాల్ చేసి పిలిపించారు. చాకచక్యంగా పామును బంధించిన గణేష్ వర్మ.. ఆడవి ప్రాంతంలో వదిలేశారు. ఇందులో పెద్ద విషయం లేదుగానీ.. ఆ పామును పట్టుకునే విధానం.. పట్టుకుని దాన్ని ఓ బాక్స్‌లో బంధించే విధానం విద్యార్థులకు ఓ పాఠంలా కనిపించింది. పామును ఎలా పట్టుకుంటున్నారో చాలా ఉత్సుకతతో చూసిన స్టూడెంట్స్ ఆ తర్వాత దాన్ని దగ్గరగా చూసి.. గణేష్ వర్మ నుంచి పాము గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కాసేపు ఇదంతా.. రొటీన్‌కి భిన్నంగా జరిగిన ఓ ప్రాక్టికల్స్‌లా అనిపించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..