Comic Con Event: థ్రిల్లింగ్ వీకెండ్‌కు అంతా రెడీ.. అబ్బురపరుస్తున్న కామిక్ కాన్ కార్టూన్ షో.

|

Jan 26, 2024 | 4:43 PM

స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్.. ఇలాంటి గేమింగ్, సినీ క్యారెక్టర్స్ అన్ని కళ్లముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. పిల్లలు, యూత్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి అద్భుతమైన ఈవెంట్‌కి మన హైదరాబాద్ వేదిక కాబోతోంది. మాదాపూర్‌లోని హైటెక్స్ శని, ఆదివారాలు అదరహో అనిపించేలా కామిక్ కాన్ -2024 ఈవెంట్‌కు అంతా సిద్ధమైంది. యానిమేషన్, గేమింగ్, సినీ, పాప్ అభిమానులను ఊర్రుతలుగించేలా కామిక్ వీకెంట్ రెడీ అయింది.

స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్.. ఇలాంటి గేమింగ్, సినీ క్యారెక్టర్స్ అన్ని కళ్లముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. పిల్లలు, యూత్ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి అద్భుతమైన ఈవెంట్‌కి మన హైదరాబాద్ వేదిక కాబోతోంది. మాదాపూర్‌లోని హైటెక్స్ శని, ఆదివారాలు అదరహో అనిపించేలా కామిక్ కాన్ -2024 ఈవెంట్‌కు అంతా సిద్ధమైంది. యానిమేషన్, గేమింగ్, సినీ, పాప్ అభిమానులను ఊర్రుతలుగించేలా కామిక్ వీకెంట్ రెడీ అయింది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో కామిక్ కాన్ ఈవెంట్ జరగబోతుంది. దీంతో ఎన్నో ప్రత్యేకతలతో ఈసారి నిర్వాహకులు ముందుకు వచ్చారు. ఈ ఎక్స్ పో కు హాజరైన వారికి మార్వెల్ కామిక్ బుక్, లిమిటెడ్ ఎడిషన్ డీసీ కామిక్ బ్యాట్ మ్యాన్ పోస్టర్ తో పాటు కామికాన్ ఇండియా బ్యాగ్ అందివ్వనున్నారు. ఈ ఈవెంట్ లో సంజయ్ గుప్తా, లిలోరోష్, యాసిడ్ టోడ్, గార్బేజ్ బిన్, కార్పొరేట్ రచించిన ఇండస్వర్స్, యాలీ డ్రీమ్స్ క్రియేషన్స్, సూఫీ కామిక్స్, ప్రసాద్ భట్, రాజ్ కామిక్స్ వంటి ఎంతో మంది కళాకారులుస ఎన్నో కామిర్ బుక్స్, కార్టూన్స్ అలరించబోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శని, ఆదివారాల్లో ఈవెంట్ జరగనుంది. ఈ థ్రిల్లింగ్ వీకెంట్ హైదరాబాద్ వాసులకు అందించేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామని నిర్వహకులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos