Maldives: మాల్దీవుల జలాల్లోకి చైనా పరిశోధక నౌక.! భారత్‌పై నిఘాపై డ్రాగన్‌ కుట్ర.

|

Feb 24, 2024 | 7:05 PM

భారత్‌తో దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం..

భారత్‌తో దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్‌కు లభిస్తుందని నావికాదళ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ తరహా చైనా నౌకలు గతేడాది వరకు శ్రీలంకలో లంగరేశాయి. కానీ, ఈ సారి కొలంబో ఇందుకు అంగీకరించలేదు. ఈ నౌకలు సైనిక-పౌర ప్రయోజనాలకు సంబంధించినవని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. వాటిలోని సాధనాలు నిఘా సమాచారాన్ని సేకరిస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇవి భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు , గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..