స్పూన్ మింగేశాడు..ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా వీడియో
చైనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి సిరామిక్ చెంచాను మింగాడు అయితే అది అతనికి తెలియకపోవడం విశేషం. అతనికి తెలియకుండానే ఆర్నెల్లుగా అతడి పేగుల్లోనే ఉండిపోయింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు ప్రకారం.. యాన్ అనే వ్యక్తి జూన్‌లో షాంగైలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాక ఈ విషయం బయట పడింది. ఆహారం తీసుకున్నప్పుడు ఏదైనా ప్లాస్టిక్ ముక్కను మింగానేమోనని అనుకున్నాడు. కానీ స్కానింగ్‌లో విస్తుపోయే విషయం తెలిసింది.
చిన్న పేగులో ఏదో ఉందని వైద్యులు గుర్తించారు. ఆ స్పూన్ సున్నితమైన భాగంలో ఉండడంతో చాలా ప్రమాదకరమని వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. తను స్పూన్ మింగినట్టు లీలగా గుర్తుకొచ్చేది. స్పూన్ పొట్టలోకి జారినట్లు కల కన్నాననీ అనుకునేవాడు. ఎలాంటి ఆరోగ్య సమస్య రాక పోవడంతో సాధారణంగా ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోగా ఆ స్పూన్ ఉన్న విషయం అతనికి తెలిసింది. అయితే ఈ పరికరం తన కడుపులోకి ఎలా వెళ్లిందో యాన్ గుర్తు తెచ్చుకున్నాడు. జనవరిలో థాయ్‌లాండ్‌కి వెళ్లినప్పుడు అక్కడ విపరీతంగా తాగినట్లు, వాంతులు చేసుకోవడానికి కాఫీ స్పూన్‌తో ప్రయత్నించినట్లు గుర్తు చేసుకున్నాడు. ఆ స్పూన్ జారిపోయి గొంతులోకి వెళ్లింది. తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం చైనాకు వచ్చిన తర్వాత యథావిధిగా తన పనులు చేసుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
రోజుకు 360 సార్లు వాంతులు.. ఎందుకో తెలిస్తే షాక్! వీడియో
కోతుల బీభత్సం.. స్కూలుకు వెళ్తున్న విద్యార్ధినిపై వీడియో
‘వామ్మో.. వాడు పెద్ద సైకో’వీడియో
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

