‘పెళ్లి ఓ టైం వేస్ట్!’ నాగరికతకు దూరంగా గుహలో నివాసం.. అసలు ఎవరితను?

Updated on: Jun 19, 2025 | 7:31 PM

నేటితరం యువత సిటీ లైఫ్‌కు విపరీతంగా అలవాటు పడిపోయారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్‌తో పార్టీలు, సినిమాలు, షీకార్లు వారి జీవన శైలిలో భాగమైపోయాయి. అంతేకాదు, లగ్జరీ లైఫ్ స్టైల్‌ ఒక డ్రీమ్‌గా భావిస్తుంటారు. అలాంటిది.. 'ఇదంతా టైమ్ వేస్ట్!' అంటూ ఓ యువకుడు ఎవరు ఊహించలేని నిర్ణయం తీసుకున్నాడు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అంతేకాదు, అతడిని సోషల్ మీడియా స్టార్‌ను కూడా చేసింది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా. చైనా దేశంలోని షిఛువాన్ ప్రావిన్స్‌కు చెందిన మిన్ హెంగ్‌కై అనే 35 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. హెంగ్‌కై గతంలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తూ నెలకు దాదాపు 1400 డాలర్లు సంపాదించేవాడు. అయితే, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, అప్పులు వంటి పరిస్థితులపై విసుగు చెంది 2021లో ఉద్యోగం వదిలేసి అందరిని ఆశ్చర్యపరిచే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన స్వగ్రామంలో ఉండే ఓ చిన్న గుహలోకి మకాం మార్చి దాన్నే తన నివాసంగా నూతన జీవనాన్ని ప్రారంభించాడు. సుమారు 50 చదరపు మీటర్ల గుహను అతను తన ఇంటిగా తీర్చిదిద్దాడు. ఆ గుహకు బ్లాక్ హోల్‌గా పేరు పెట్టి.. స్నానం చేయడానికి టబ్, మురుగు నీరు బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు, తాగునీటి కోసం చిన్న డబ్బాలు.. ఇలా తనకు కావాల్సిన వాటితో సౌకర్యవంతంగా మార్చుకున్నాడు. అంతేకాదు, ‘ నిజమైన ప్రేమ దొరకటం చాలా అరుదు. పెళ్లి.. మనీ, టైం వేస్ట్!’ అని హెంగ్‌కై అన్నాడు. పెళ్లి, ఉద్యోగం వంటి వాటికి దూరంగా ఉంటూ, చిన్న పొలంలో పండ్లు కాయలు పండించుకుంటూ, పుస్తకాలు చదువుతూ, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇతడి జీవన శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇతడి లైఫ్‌ స్టైల్‌కు ఫీదా అయిన నెటిజన్లు ‘మోడర్న్‌ కేవ్‌మ్యాన్’ అని పిలుస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలే కోతి.. దాని చేతికి అద్దం దొరికితే..!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా

కూలీలు పని చేస్తుండగా పొదల్లో ఏవో కదలికలు.. ఏంటా అని చూడగా

పర్యాటకులను ఆకర్షించిన సింహాల జంట.. వీరూ మరణంతో ఒంటరైన జై..!

మీలో ఈ లక్షణాలు ఉంటే.. డి విటమిన్‌ లోపమే కారణం