మేకప్ ప్రొడక్ట్స్‌తో బీ అలర్ట్..పాపం ఆ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్..వీడియో
మేకప్ వేసుకోవడం చాలా మంది అమ్మాయిలకి ఇష్టం. అదీ గాక యూట్యూబ్‌ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో చేసే పనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్‌లు సైతం మేకప్ ప్రొడక్ట్స్ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలా మంది వీటిని పెడచెవిన పెట్టేస్తున్నారు.
ఓ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ నిర్లక్ష్యంగా చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది. తైవాన్ దేశం బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ మేకప్ ముక్‌బాంగ్‌కు ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మేకప్ వీడియోలకు వేలాది మంది అభిమానులున్నారు. సింపుల్ చిట్కాలతో చక్కగా మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించడంతో పాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్ టేస్ట్ చేస్తానంటూ కామెడీ చేసేది. ఒక్కోసారి నిజంగానే టేస్ట్ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్ వీడియోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్ దగ్గరి నుంచి లిప్‌స్టిక్ వరకు అన్ని టేస్ట్ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్
మరిన్ని వీడియోల కోసం :
జంట పాముల సయ్యాట..నెట్టింట వీడియో వైరల్
శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి వీడియో
యజమాని వదిలేసి వచ్చినా.. 70 కి.మీ నడిచొచ్చిన శునకం వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
