Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

Samatha J
|

Updated on: Jun 20, 2025 | 6:38 AM

Share

పెళ్లి వయస్సు దాటిపోతుంది.. దీనికి తోడు పెళ్లి సంబంధాలు కూడా రావటం లేదు... చేసేది లేక బ్రోకర్లను ఆశ్రయించాడు ఓ యువకుడు. అదే అతని కొంప ముంచింది... ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు పెళ్ళాం అద్దెకు వచ్చింది.. వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్న అదే నిజం. డబ్బుకు కక్కుర్తి పడ్డ బ్రోకర్లు ఆడిన ఆటలో బలిపశువయ్యాడు ఆ పెళ్ళికొడుకు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ మహిళ 10 వేలకు ఆశ పడి వాళ్ళతో చేతులు కలిపింది.. పెళ్ళి చేసుకుని పరిపోదాం అనుకుంది కానీ అవకాశం లేకపోవటం తో ఐదేళ్ళ కొడుకు కోసం అసలు విషయం బయట పెట్టింది. దాంతో కంగు తిన్న ఆ నవ వరుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కర్నాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్‌ అనే యువకుడికి వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరకపోవడంతో సంబంధం చూడమని రాయచూరుకు చెందిన శ్రీదేవి అనే మహిళకు చెప్పాడు. ఆమె రాజమహేంద్రవరానికి చెందిన తయారు అనే పెళ్లిళ్ల బ్రోకర్ కు విషయం చెప్పింది.

తాయారు.. విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్ ముఖర్జీ కి విషయాన్ని చేరవేసింది. ఇలా కర్నాటకలో మొదలైన ఈ ప్రయాణం విజయవాడ వచ్చి ఆగింది. ముఖర్జీ ఆటోడ్రైవర్ గా పని చేస్తూనే పెళ్లిళ్ల బ్రోకర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అతను తనకు పరిచయం ఉన్న విజయవాడ వాంబే కాలనీ చెందిన మరో ఇద్దరు మహిళలకు విషయం చెప్పాడు. ఇలా ఒకరు నుండి మరొకరికి పాకుతూ ఈ పెళ్లి సంబంధం కాస్త బ్రోకర్ల వద్దకు చేరింది. వరుడిది పొరుగు రాష్ట్రం వాడు కావడంతో తమ పని ఈజీగా అయిపోతుందనుకున్న ఈ బ్రోకర్ల ముఠా ఓ భారీ స్కెచ్‌ వేశారు. ఈ బ్రోకర్లు అంతా కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళను ఎంపిక చేశారు. ఆమెకు కొన్నాళ్ల క్రితం పెళ్ళై భర్త ఎటో వెళ్లిపోవడంతో ఐదేళ్ల కుమారుడుతో ఒంటరిగా ఉంటుంది. ఆమెకు డబ్బు ఆశ చూపించిన ఈ బ్రోకర్లు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పెళ్ల అయిన తర్వాత కొన్ని రోజులు కాపురం చేసి, ఏదొక వంకపెట్టుకొని తిరిగి వచ్చేయమని చెప్పారు. పెళ్లికూతురిగా నటించినందుకు 10 వేల రూపాయలు ఇస్తామని ఒప్పించారు. ఈ క్రమంలో ఖర్చులకని చెప్పి 50వేల రూపాయలు దుర్గాప్రసాద్ నుంచి ఫోన్ పే చేయించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

జంట పాముల సయ్యాట..నెట్టింట వీడియో వైరల్

శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి వీడియో

యజమాని వదిలేసి వచ్చినా.. 70 కి.మీ నడిచొచ్చిన శునకం వీడియో