Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యజమాని వదిలేసి వచ్చినా.. 70 కి.మీ నడిచొచ్చిన శునకం వీడియో

యజమాని వదిలేసి వచ్చినా.. 70 కి.మీ నడిచొచ్చిన శునకం వీడియో

Samatha J
|

Updated on: Jun 19, 2025 | 2:44 PM

Share

విశ్వాసంలో శునకానికి మించిన జంతువు మరొకటి లేదనటానికి మరో ఉదాహరణే ఈ ఘటన.కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన పున్నం మల్లయ్య ఆరేళ్ల క్రితం తన ఇంటి వెనకాల సరిగ్గా కళ్లుకూడా తెరవని ఓ బుజ్జి కుక్క పిల్లను చూశాడు. అయితే, చుట్టు పక్కల ఎక్కడా దాని తల్లి, దానితో బాటు పుట్టిన ఇతర కుక్కపిల్లల జాడ కానరాలేదు. తల్లి లేని ఆ చిన్ని కుక్కపిల్ల మీద జాలితో దానిని తన ఇంటికి తీసుకొచ్చి దానికి రోజూ పాలు, ఆహారం ఇచ్చేవాడు మల్లయ్య. చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలో అది పెరిగి పెద్దదయింది. మల్లయ్య ఎక్కడికి వెళ్లినా అది నీడలా వెంట వచ్చేది. దీంతో యజమాని కుటుంబంతో దాని బాండింగ్ కూడా పెరుగుతూ వచ్చింది.

ఎప్పుడైనా మల్లయ్య కుటుంబం పొరుగూరు వెళ్లాల్సి వస్తే.. దాని ఆలనాపాలనా చూసే బాధ్యతను పక్కింటి వారికి అప్పగించి వెళ్లేవారు.మళ్లీ వాళ్లు తిరిగి ఇంటికి చేరే వరకు అది దిగులుగా ఎదురుచూస్తూ కూర్చునేది. కుటుంబ సభ్యులు పొలం పనుల కోసం వెళితే.. ఇంటికి ఎవరూ రాకుండా కాపలా కాస్తుండేంది. ఇలా.. ఆ శునకం.. మల్లయ్య కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారింది. అయితే.. ఇటీవల కాలంలో ఎవరైనా కొత్త మనుషులు ఇంటికి వస్తే..ఈ శునకం వారిపై దాడి చేసి గాయపరచటంతో ఇరుగు పొరుగు వారంతా ఇబ్బంది పడుతున్నారు. దీంతో వారంతా.. దానిని ఏదైనా దూర ప్రాంతంలో వదిలేసి రావాలని మల్లయ్య కుటుంబాన్ని కోరారు. దీంతో మనసుకు కష్టంగా ఉన్నా.. దానిని వదిలిపెట్టి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే బైక్ పైన తీసుకెళితే.. అది మళ్లీ తిరిగి వస్తుందనే ఉద్దేశంతో.. దానిని కారులో ఎక్కించి, రోడ్డు కనిపించకుండా కిటికీ అద్దాలు మూసేసి మరీ వారి ఊరికి 70 కిలోమీటర్ల దూరంలోని ఓ అటవీ ప్రాంతంలో కారు ఆపి దానిని కిందికి దించారు. తనతో బాటు యజమాని కోసం దిగుతాడని భావించిన ఆ శునకం తనను వదిలేసి వెళ్ళిపోతున్న యజమాని వాహనం వెంట కొంత దూరం వేగంగా పరిగెత్తింది.

మరిన్ని వీడియోల కోసం :

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్‌ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో