శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి వీడియో
శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. తాజాగా, ఈ అటవీ ప్రాంతంలో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అరుదైన జీవిని కనుగొన్నారు. చూసేందుకు పామును పోలి ఉండే ఈ జీవి స్కింక్ నలికిరి జాతిలో కొత్త రకంగా గుర్తించారు. చర్మంపై చారలు, పాక్షికంగా పారదర్శక కనురెప్పలు ఉండటం దీని ప్రత్యేకత.
ఆకట్టుకునే ఈ జీవికి ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ తాజాగా ప్రకటించారు. ఈ అరుదైన జాతి ప్రస్తుతం కేవలం రెండు ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శేషాచలంతో పాటు తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో కూడా కనిపించందన్నారు. ఇది భారతదేశం అడవుల్లో ఇప్పటికీ అన్వేషించాల్సిన ఎన్నో రహస్యాలను సూచిస్తోందని బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక ఈ పరిశోధనలో జడ్‌ఎస్‌ఐ హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతా రెప్టిలియా విభాగం, లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో
జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో
వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో
వైరల్ వీడియోలు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

