విమానం కంటే వేగం ఈ రైలు.. గంటకు 600 కి.మీ
హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన చైనా.. తాజాగా విమానంతో పోటీపడే రైలును తయారు చేసింది. ఈ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్లు అని తెలుస్తోంది. తాజాగా 17వ మోడర్న్ రైల్వే ఎగ్జిబిషన్‌లో మాగ్లెవ్ రైలును చైనా ప్రదర్శించింది. దీంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనా విజయవంతంగా మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో సరికొత్త హైస్పీడ్ రైలును ఆవిష్కరించింది.
విమానంతో పోటీ పడే రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది కేవలం 7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు తెలిపారు. ఇక, ఇది అందుబాటులోకి వస్తే.. బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి ఐదున్నర గంటల సమయం పడుతోంది. 2025 చివరి నాటికి హై-స్పీడ్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజినీర్లు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అయస్కాంత వ్యతిరేక క్షేత్రాలను ఉపయోగించుకొని.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుతుందని బీజింగ్‌లో అధికారులు తెలిపారు. ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించనుంది. ఈ ఏడాది జూన్‌లో చైనా ఇంజినీర్లు దీన్ని పరీక్షించారు. దీంతో, అందరి దృష్టి ఈ రైలుపై పడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంటి చూపును ఇచ్చే శైవక్షేత్రం వెల్లీశ్వరర్
మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్ తీసుకున్నారా? ఏం చేయాలంటే
ఎంత లాగినా ఒడ్డుకు రాని వల.. తీరా చూస్తే షాక్! జాలరి దశ తిరిగిపోయింది