జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి

Updated on: Dec 13, 2025 | 1:44 PM

చైనాలోని జెజియాంగ్ సఫారీ పార్కులో జంతు ప్రదర్శన సందర్భంగా ఓ ఎలుగుబంటి జూ కీపర్‌పై దాడి చేసింది. సంచిలోని ఆహారం చూసి టెంప్ట్ అవ్వడంతో ఇది జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కీపర్‌కు గాయాలు కాలేదు. ఈ వీడియో వైరల్ అవ్వగా, జంతు ప్రదర్శనల భద్రత, జంతు సంరక్షణపై నెటిజన్లు తీవ్ర చర్చ జరిపారు. జంతువులను లాభాపేక్షతో ఉపయోగించడం సరికాదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైనాలో అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి జూ కీపర్‌పై దాడి చేసింది. అలా ఎందుకు చేసిందో అక్కడున్న పార్క్‌ నిర్వాహకులెవ్వరికీ అర్థం కాలేదు. తేరుకున్న మిగతా సిబ్బంది జూకీపర్‌ని ఎలుగుబంటి దాడి నుంచి రక్షించే యత్నం చేశారు. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని సఫారీ పార్క్‌లో జంతువుల సర్కస్‌ లైవ్‌ ప్రదర్శన జరుగుతోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కానీ అది మాత్రం అతడిని గట్టిగా పట్టుకుని దాడి చేసేందుకే ట్రై చేసింది. చివరికి జూ సిబ్బంది ఆ ఎలుగుబంటి నుంచి అతడిని రక్షించారు. ఎలుగును సెల్‌లోకి తరలించారు. అది జూకీపర్‌ సంచి నిండా యాపిల్స్‌, క్యారెట్లు తీసుకురావడం చూసి..టెంప్టయ్యి అలా దాడి చేసి ఉంటుందని జూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే జూకీపర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని జూ నిర్వాహకులు తెలిపారు. ఎలుగుబంటిని పబ్లిక్‌ షోల నుంచి తొలగించినట్లు తెలిపారు. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియోను చూసి సర్క్‌స్‌లో జంతవుల ప్రదర్శనల విషయంలో ఏమరపాటు తగదనీ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. వాటికి ఇబ్బంది కలిగించేలా లేదా అవి టెంప్టయ్యేలా ఆహార పదార్థాలు ఉంచినా వాటిని కంట్రోల్‌ చేయలేమనీ జంతువుల సంరక్షకులు ఈ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలనీ లేదంటే జూ కీపర్‌కి పట్టిన గతే పడుతుందని రాసుకొచ్చారు. లాభం కోసం వాటితో అలాంటి పనులు చేయిస్తే ఫలితం అలానే ఉంటుందని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి

అరబ్ దేశాలకు చైనా ఊహించని షాక్‌.. సముద్రపు నీటితో ఫ్యూయల్‌ తయారీ

పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..

అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..

TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్