ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారా ?? ఈ స్టోరీ చూడాల్సిందే
పెళ్లికి ముందుగా.. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి కుదిరి నిశ్చితార్థం అయితే చాలు ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా, ఇలాగే ప్లాన్ చేసుకున్న ఓ యువకుడు ఆ సమయంలో అమ్మాయిని హగ్ చేసుకున్నందుకు గానూ.. భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఆ పెళ్లి క్యాన్సల్ కావడంతో.. తనను హగ్ చేసుకున్నందుకు గానూ రూ. 3.73 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆ అమ్మాయి డిమాండ్ చేసింది. చైనాలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.
చైనాలో ఓ యువజంట జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత వారు ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్నారు. ఒక హోటల్‌లో రూమ్ తీసుకుని.. మరీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కి పోజులిచ్చారు. ఈ క్రమంలో.. అమ్మాయిని ముందు నిలబెట్టి.. ఆమెను వెనకనుంచి హగ్ చేసుకోవాలని ఫోటో గ్రాఫర్ సూచించాడు. సరేనంటూ ఆ యువకుడు.. అలాగే పోజిచ్చాడు. అంతే.. ఆ అమ్మాయికి ఎక్కడలేని కోపం వచ్చింది. పెళ్లికి ముందు ఇలా హగ్ చేసుకోవడం కరెక్ట్ కాదని మండిపడింది. అంతే కాదు.. పెళ్లి క్యాన్సిల్ అని తెగేసి చెప్పేసింది. నిశ్చితార్థం ఖర్చుల కింద.. తాను వాడిన రూ. 3.73 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. నిశ్చితార్థం వేళ.. అబ్బాయి కుటుంబం .. కాబోయే కోడలికి రూ. 25 లక్షలు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ కావడంతో, వారిచ్చిన 25 లక్షల్లో.. రూ. 3.73 లక్షలు కట్ చేసి మిగతా అమౌంట్‌ను అబ్బాయికి తిరిగి ఇచ్చేసింది. ‘ఇదేంటి?’అని ఆ అబ్బాయి నిలదీయగా.. ‘హగ్ చేసుకున్నావుగా.. అందుకు’ అని గడుసుగా జవాబిచ్చింది. కాగా.. తాను వెయ్యికిపైగా పెళ్లిల్లు చేశానని, ఇలాంటి అమ్మాయిని మాత్రం ఎక్కడా చూడలేదని ఈ పెళ్లి కుదర్చిన పెద్దమనిషి వాపోయాడు. కారణం లేకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇలా నాలుగు లక్షల రూపాయిలు కట్ చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ‘పెళ్లిళ్ల పేరయ్య’.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళి తరువాత వెండి ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
ఉపరితల ఆవర్తనంతో ఏపీ,తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
TOP 9 ET News: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బర్త్ డే సర్‌ప్రైజ్
బిగ్ బాస్‌కు బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి వల్ల పీకల్లోతు చిక్కుల్లో షో
