ఆపీసులో కునుకు తీశాడని ఉద్యోగం పీకేశారు.. కోర్టులో కొట్లాడితే రూ.40.78 లక్షల నష్టపరిహారం

|

Nov 30, 2024 | 11:13 AM

ఆఫీసుకెళ్లి పనిచేయాల్సిన ఉద్యోగి టేబుల్‌ మీదే గుర్రుపెట్టి నిద్రిస్తే ఏమవుతుంది? ఏ కంపెనీ అయినా సాలరీ సెటిల్‌ చేసి ఇంటికి పంపిస్తుంది. చైనాలోని ఓ కెమికల్‌ కంపెనీలో అదే జరిగింది. కానీ ఆ ఉద్యోగి మాత్రం ఏకంగా కోర్టు మెట్లే ఎక్కేశాడు. చోట టేబుల్‌ మీద కునుకు తీస్తే ఏమవుతుంది? అదేమైనా ఉద్యోగం తీసివేసేంత పెద్ద తప్పా? అంటూ బాధిత ఉద్యోగి కోర్టులో వాధించాడు.

విచారించిన న్యాయస్థానం అతడి వాదనతో అంగీకరించింది. 3.5 లక్షల యువాన్లు అంటే మన కరెన్సీలో దాదాపు 40.78 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని సదరు కంపెనీని ఆదేశించింది. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్‌లో జరిగిందీ ఘటన. ఓ కెమికల్ కంపెనీలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఝాంగ్‌ అనే వ్యక్తికి మంచి పేరుంది. ఇటీవల విధుల్లో ఉండగా అలసిపోయి తన డెస్క్‌పైనే ఓ కునుకు తీశాడు. అది కాస్తా అక్కడున్న సీసీటీవీ కెమెరాకు చిక్కడంతో కంపెనీ హెచ్‌ఆర్ విభాగం తీవ్రంగా పరిగణించింది. విధుల్లో ఉండగా దాదాపు గంటపాటు నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు హెచ్ఆర్ విభాగం నోటీసు పంపించింది. విధుల్లో నిద్రపోవడం అంటే కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందికే వస్తుందని నోటీసుల్లో పేర్కొంది.ఆ నోటీసును చూసి ఝాంగ్ విస్తుపోయాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆమెకు 91.. అతడికి 23.. హనీమూన్‌లో ఏం జరిగిందంటే ??

వీళ్ల ఓవర్ యాక్షన్‌తోనే తెలిసిపోతోంది.. ఈ IT రైడ్స్ ఫేక్‌ అని !!