Kabaddi: కటౌట్లు చూసి కొన్ని నమ్మెయ్యొద్దు డ్యూడ్.. బుడ్డోడా మజాకా.. ప్రత్యర్థిని చాకచక్యంగా పట్టేసి..(వీడియో)

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Sep 27, 2022 | 8:32 AM

సోషల్‌ మీడియాలో రోజూ ఎన్నోరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని స్పూర్తిదాయకంగా ఉంటాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన


సోషల్‌ మీడియాలో రోజూ ఎన్నోరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని స్పూర్తిదాయకంగా ఉంటాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అనేకమంది తమ ప్రతిభను తమదైనశైలిలో ప్రపంచంముందు ఆవిష్కరిస్తున్నారు. భారతదేశంలో క్రీడలకు ఎంతో ప్రాథాన్యత ఉంటుంది. ఇందులో కబడ్డీ కూడా ఒకటి. చిన్నపిల్లలనుంచి పెద్దలవరకూ దీనిని ఎంతగానో ఇష్టపడతారు. తాజాగా కొందరు చిన్నారులు కబడ్డీ ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు చిన్నారులు కబడ్డీ ఆడుతున్నారు. వారిలో ఓ ఐదేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఈ బుడ్డోడు ఆటతీరు చూస్తే ఔరా అనకమానరు. ప్రత్యర్థి కూతకు వచ్చినపప్పుడు ఆ చిన్నారి వెంటనే అలర్ట్ అయ్యి.. అతని కాళ్లు గట్టిగా పట్టుకుని లాగాడు. దాంతో అతను అవతలి వైపుకు వెళ్లలేక చిక్కుకుపోయాడు. ఆ తర్వాత జట్టుసభ్యులందరూ వచ్చి అతనిని కింద పడేసి పాయింట్ సాధిస్తారు. అయితే ప్రత్యర్థిని పట్టుకున్న చిన్నారి.. మిగతా వారితో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉన్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత, కచ్చితంగా పిల్లల ధైర్యానికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఈ అద్భుతమైన వీడియోను ఐపీఎస్ అధికారి ప్రహ్లాద్ మీనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘వయస్సు ద్వారా కాదు, ఒక వ్యక్తి తన విశ్వాసం, దృఢ సంకల్పం, ఉన్నత స్ఫూర్తితో అతి పెద్ద కష్టాన్ని అధిగమించగలడు’ అనే క్యాప్షన్‌ జోడించారు. ఈ వీడియోను మిలియన్‌కంటే ఎక్కువమందే వీక్షించారు. లక్షల్లో లైక్ చేశారు. అద్భుతం..అంటూ తమదైనశైలిలో కామెంట్లు కురిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu