సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. కేజీ చికెన్ ఎంతో తెలుసా?
భారతదేశంలో చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగి, మాంసం ప్రియులకు షాక్ ఇచ్చాయి. పండుగ సీజన్లలో పెరిగిన డిమాండ్, పౌల్ట్రీ రైతులు పెంపకం తగ్గించడం, దాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో సరఫరా తగ్గింది. జనవరి మొదటి వారంలో ధరలు కిలోకు ₹300 దాటాయి. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది, వినియోగదారులపై భారం పడుతోంది.
నాన్‌వెజ్ ప్రియులకు 2026 సంవత్సరం చేదు వార్త అని చెప్పవచ్చు. దేశంలోని చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న మాంసం ధరలు ఒక్కసారిగా పుంజుకుని, వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో చికెన్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా డిసెంబర్ నెలలో కిలో చికెన్ ధర 240 నుండి 250 మధ్య ఉండగా.. జనవరి మొదటి వారంలోనే ట్రిపుల్ సెంచరీ దాటింది. ప్రధాన కారణం పండగ సీజన్ కావడంతో విందు వినోదాల కోసం చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి. దీంతో పండక్కి చికెన్ ముద్ద నోట్లోకి వెళ్లాలంటే ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందే. గతేడాది బర్డ్ ఫ్లూ భయాలతో చికెన్ ధరలు పతనమయ్యాయి. ఆ తర్వాత వ్యాధులు తగ్గి కాస్త ఊరట లభించినా, వాటి మేత ధరలు పెరగడంతో నిర్వహణ భారం పెరిగి చాలా మంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. దీంతో సుమారు 1 నుంచి రెండు శాతం మేర కొళ్ల పెంపకం తగ్గిపోయింది. ఇక ఉత్పత్తి తగ్గినా, తినే వాళ్లు తగ్గకపోవడంలో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. దీంతో ఇంటిగ్రేషన్ కంపెనీలు ధరలు భారీగా పెంచినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కార్తీక మాసంలో చికెన్‌కు డిమాండ్ తగ్గినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన క్రిస్‌మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అటు న్యూ ఇయర్ సందర్భంలో సైతం అమ్మకాల్లో అదే జోరు కనిపించింది. దీంతో మార్కెట్‌లో మాంసం కొరత ఏర్పడింది. ఇక సప్లయ్ తగ్గి డిమాండ్ పెరగడంతో చికెన్ సరఫరా కంపెనీలు రేట్లు పెంచేశాయ్. ఇదిలా ఉండగా మరో మూడో రోజుల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చే నెలలో మరో DSC నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా ??
ఆహారం కల్తీ చేస్తే.. అటెంప్ట్ టు మర్డర్ కేస్
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
ఒక్కసారి కడితే చాలు.. జీవితాంతం బీమా.. ఎల్‌ఐసీ కొత్త స్కీమ్
