వచ్చిన పార్సిల్‌.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..

Updated on: Feb 25, 2026 | 1:44 PM

చెన్నైలోని ఓ దుకాణంలో శ్రుతికి పుర్రె, ఎముకలున్న పార్సిల్‌ రావడంతో కలకలం రేగింది. ఇది తనది కాదని శ్రుతి తిరస్కరించగా, యజమాని తెరిచి చూసి షాకయ్యారు. పోలీసుల దర్యాప్తులో వ్యక్తిగత కక్షల కారణంగా దినేష్ ఈ చర్యకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన పని ప్రదేశాల్లో మహిళల భద్రత ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.

తనకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూడటానికి ఓ మహిళ నిరాకరించింది. ఆ పార్సిల్‌ను అందుకున్న మహిళ భయంతో వణికిపోయింది. చెన్నైలోని పారీస్ కార్నర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. శృతి ప్యారిస్‌ కార్నర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి శృతి పనిచేసే దుకాణం దగ్గరకి వచ్చి, శృతికి పార్సిల్‌ వచ్చిందని సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు ఆ పార్సిల్‌ను తీసుకెళ్లి శృతికి ఇచ్చాడు. దాంతో శృతి ఆ పార్సిల్‌ తనది కాదని చెప్పింది. దాన్ని తీసుకునేందుకు నిరాకరించింది. దాంతో దుకాణ యజమాని తన సిబ్బంది అందరి సమక్షంలో పార్శిల్‌ తెరిచి చూశాడు. అందులో మనిషి పుర్రె, ఎముకలు, విభూది ఉండడం చూసి అంతా షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రుతి కుటుంబీకులకు, అదే షాపులో పనిచేసే దినేశ్‌ కుటుంబీకులకు గొడవలు ఉన్నాయని.. ఆమెను భయపెట్టేందుకు దినేశ్‌ ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు దినేశ్‌ను‌, అతని అనుచరులు శ్రీనివాసన్‌, జోసెఫ్‌ను అరెస్టు చేశారు. షాపుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోంది. వారిని మానసిక వేధింపులకు గురి చేయడం వారు ఎదురుతిరిగితే కక్ష పెంచుకోవడం వంటి ఘటనలకు చెక్‌ పడాలి. పని ప్రదేశాలలో మహిళలకు భద్రత నిచ్చే సురక్షిత వాతావరణం కల్పించే బాధ్యతను యాజమాన్యం తీసుకోవాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం

కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌ మరణాలకు కారణం అదేనా ??

పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా

Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’

Follow Us