Man Killed Parents: ఓ కుమారుడు చేసిన ఘనకార్యం.. వృద్ధులనే కనికరం లేకుండా తల్లిదండ్రులను చంపి రెండు రోజులు..
తల్లిదండ్రులు.. వృద్ధులనే కనికరం లేకుండా ఓ కుమారుడు కిరాతకంగా హతమార్చాడు. వారి మృతదేహాలతో రెండు రోజులు కాలం గడిపాడు. చివరకు దుర్వాసన రావడంతో స్థానికుల ద్వారా ఈ జంట హత్య వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభ కోణం సమీపంలోని పట్టీశ్వరం గ్రామానికి చెందిన గోవిందరాజ్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్దకుమారుడు రవిచంద్రన్ అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ ప్రమాదం రూపంలో గతంలో మరణించాడు. ఇక, కుమార్తె గీత పెళ్లయిన కొన్నాళ్లకు మరణించింది. రెండో కుమారుడు రాజేంద్రన్‌కు వివాహం కాలేదు. ఇతడు తల్లిదండ్రులతో కలిసి తిల్లయంబూరులో నివాసముంటున్నాడు. తనకు పెళ్లి కాలేదన్న వేదనతో మానసికంగా కృంగి ఓ రోగిగా మారాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. వారిద్దరిని చితక్కొట్టేవాడు. మళ్లీ పశ్చాత్తాపంతో వారి వద్దే ఉండేవాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో జరిగిన గొడవలో రాజేంద్రన్ ఉన్మాదిగా మారిపోయాడు. ఇంటిలో వేట కొడవలితో తల్లిదండ్రులిద్దరినీ అతి కిరాతకంగా చంపేశాడు. తల, కాలు, చేతులపై ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. ఆ ఇద్దరు మరణించడంతో.. ఏమీ ఎరుగనట్లుగా ఆ మృతదేహాలతో రెండు రోజులు కాలం వెళ్లదీశాడు. అయితే రెండు రోజుల తర్వాత తీవ్ర దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పట్టీశ్వరం పోలీసులు అక్కడ కనిపించిన దృశ్యంతో షాక్ అయ్యారు. మంచం మీద రెండు మృతదేహాల మధ్య పడుకుని ఉన్న రాజేంద్రన్‌ను గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా తానే హతమార్చినట్టు అంగీకరించాడు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుంభకోణం ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

