హైదరాబాద్‌ శివారులో మళ్లీ చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌.. సీసీటీవీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్‌ కదలికలు.. వీడియో

|

Oct 05, 2021 | 8:54 AM

చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే జనమే కాదు.. పోలీసులు సైతం వణికిపోతారు. మరి చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు అలా ఉంటాయి. కేవలం చెడ్డీలు మాత్రమే ధరించి దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత.

చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే జనమే కాదు.. పోలీసులు సైతం వణికిపోతారు. మరి చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు అలా ఉంటాయి. కేవలం చెడ్డీలు మాత్రమే ధరించి దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. చాలా రోజుల తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ కదలికలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి వేళ చెడ్డీగ్యాంగ్ సభ్యులు తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఓ ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చెడ్డీగ్యాంగ్ ముఠాను చూసి అవాక్కయ్యారు. అమీన్ పూర్ లో అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ కదలికలను పోలీసులు పరిశీలించారు. అమీన్‌ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెదిరి టౌన్ షిప్‌ లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపించాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: సదాశివపేట జాతీయ రహదారి పై బస్సులో చైన్ స్నాచింగ్.. చెరువులో దూకిన చైన్‌స్నాచర్లు.. వీడియో

త‌ల‌ను భూమిలో పెట్టి.. ఆపై మ‌ట్టిని క‌ప్పి.. బుక్కెడు బువ్వ కోసం.. వీడియో