అతి పెద్ద క్రిస్మస్ ట్రీ.. బెంగళూరులో అదుర్స్‌

అతి పెద్ద క్రిస్మస్ ట్రీ.. బెంగళూరులో అదుర్స్‌

Phani CH

|

Updated on: Dec 25, 2023 | 2:05 PM

క్రిస్మస్‌ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలు దుకాణాల్లో షాపింగ్ సందడి మొదలైంది. నక్షత్రాలు, చెట్లు, గంటలు, ఏసు క్రీస్తు, శాంతాక్లాజ్‌ ప్రతిమలతో పాటు రకరకాల బొమ్మలు, అలంకరణ సామగ్రి దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతే జోరుగా కొనుగోళ్లు సాగుతున్నాయి. ఆకర్షణీయంగా ఉండే స్టార్స్, క్రిస్మస్ ట్రీ, ఇంకా గృహానికి అలంకరించే వస్తువులు, విద్యుత్ దీపాల బల్బులు, శాంతా క్లాజ్ తాత దుస్తులు, అంతే కాదు ఇంకా ఎన్నెన్నో ప్రజలను ఆకర్షించే పలు రకాల సామగ్రిని విక్రయిస్తున్నారు.

క్రిస్మస్‌ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా పలు దుకాణాల్లో షాపింగ్ సందడి మొదలైంది. నక్షత్రాలు, చెట్లు, గంటలు, ఏసు క్రీస్తు, శాంతాక్లాజ్‌ ప్రతిమలతో పాటు రకరకాల బొమ్మలు, అలంకరణ సామగ్రి దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతే జోరుగా కొనుగోళ్లు సాగుతున్నాయి. ఆకర్షణీయంగా ఉండే స్టార్స్, క్రిస్మస్ ట్రీ, ఇంకా గృహానికి అలంకరించే వస్తువులు, విద్యుత్ దీపాల బల్బులు, శాంతా క్లాజ్ తాత దుస్తులు, అంతే కాదు ఇంకా ఎన్నెన్నో ప్రజలను ఆకర్షించే పలు రకాల సామగ్రిని విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా ఉండే సామగ్రిని తెచ్చి అందుబాటు ధరలో అందించడంతో అస్సాంలోని గౌహతి మార్కెట్లు షాపర్ల హడావిడితో కళకళలాడుతున్నాయి. బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన అతి పెద్ద క్రిస్మస్ ట్రీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మిరుమిట్లు గొలిపే లైటింగ్‌తో ఎంతో ఎత్తు వరకు కనిపిస్తున్న ట్రీ అటుగా వెళుతున్న వారి దృష్టిని ఆకట్టుకుంటోంది. అలాగే నగరంలో షాపింగ్‌ మాల్స్‌ కిటకిటలాడుతున్నాయి. క్రిస్మస్‌ పండుగ కోసం ప్రజలు షాపింగ్‌, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. షాపింగ్‌ మాల్స్‌ ముందు క్రిస్మస్‌ తాత సాంతాక్లాజ్‌ బొమ్మలు భారీస్థాయిలో ఏర్పాటు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తగా ఆధార్‌ కోసం అప్లై చేస్తున్నారా.. పాస్ పోర్ట్ తరహాలో

ఆమె జుట్టు విలువ రూ.9 కోట్లు !! ఎందుకంటే ??

చదివింది ఇంటరే.. వీడి వేషాలు మాత్రం వేరే లెవల్‌..

ఈ కుక్కను పట్టుకున్నవారికి రూ.5 వేలు బహుమానం

వేషం చూస్తే అపర భక్తుడు.. చేసేది మాత్రం..