తాయత్తులు, రాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తి

Updated on: Jul 20, 2025 | 5:28 PM

ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే చంగూర్ బాబా, ఇప్పుడు కోట్లకు పడగెత్తాడు. మిడిల్ ఈస్ట్‌లోని ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు వచ్చినట్లు గుర్తించారు. అక్ర‌మంగా మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డిన‌ట్లు చంగూర్ బాబాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాంతో ఈడీ ఉచ్చు బిగించింది. చంగూర్ బాబాపై .. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసు న‌మోదు చేసింది.

 అక్ర‌మంగా మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డిన‌ట్లు చంగూర్ బాబాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విదేశీ నిధులను కూడా భారీగా సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్ 2024లో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. బ‌ల‌రాంపూర్‌లో అధిక సంఖ్య‌లో మత‌మార్పిడుల‌కు పాల్ప‌డిన‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సైకాల‌జిక‌ల్ వ్యూహాలు, మ‌త‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు, విదేశీ నిధుల‌తో .. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారిని మార్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఎక్కువ‌గా ఎస్సీల‌ను ఇస్లాంలోకి మ‌ళ్లించిన‌ట్లు తెలుస్తోంది. పీఎంఎల్ఏ చ‌ట్టం కింద ఈడీ ద‌ర్యాప్తు మొద‌లుపెట్టింది. చంగూర్ బాబాతో పాటు అత‌ని అనుచ‌రుల‌కు చెందిన 40 బ్యాంకు అకౌంట్ల‌లో 106 కోట్లు ఉన్న‌ట్లు గుర్తించారు. ఎక్కువ శాతం డ‌బ్బు ప‌శ్చిమాసియా నుంచి అందిన‌ట్లు తెలుస్తోంది. చంగూర్ బాబా, నీతూ అలియాస్ న‌స్రీన్‌ను.. జూలై 5వ తేదీన ల‌క్నోలో ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. అత‌నికి చెందిన అనేక ప్రాప‌ర్టీలను ప్ర‌భుత్వం ధ్వంసం చేస్తోంది. బ్యాంకులు, స్థానిక అధికారుల నుంచి ఈడీ అద‌న‌పు స‌మాచారాన్ని సేక‌రిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన విజయ్‌ దేవరకొండ

ఎన్ని AIలు వచ్చినా మనిషి మేధస్సుకు ఢోకా లేదు

చిన్నోడనుకునేరు.. మనోడు మహా రసికుడు..

గుడ్డు వారికి పాయిజన్‌తో సమానం!

సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు