Alissa Carlson Schwartz: టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కుప్పకూలిపోయిన వాతావరణ శాఖ నిపుణులు.. షాకింగ్ వీడియో వైరల్

Meteorologist Alissa Carlson Schwartz: వాతావరణ నిపుణులు అలిస్సా కార్ల్సన్ స్క్వార్ట్‌జ్ తన వాతావరణ నివేదిక ఇస్తూనే లైవ్‌లోనే కుప్పకూలిపోయింది.

Alissa Carlson Schwartz: టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కుప్పకూలిపోయిన వాతావరణ శాఖ నిపుణులు.. షాకింగ్ వీడియో వైరల్
Alissa Carlson Schwartz

Updated on: Mar 19, 2023 | 1:29 PM

ఇటీవల గుండెపోట్లతో గుండె బేజారవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా పట్టుమని పాతికేళ్లు కూడా లేని వాళ్లు ఉన్న ఫళంగా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు హడలెత్తిస్తున్నాయి. అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా మరణించే సందర్భాలు సాధారణం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఇటువంటి సంఘటనలు చోటచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల, CBS LA వాతావరణ నిపుణులు అలిస్సా కార్ల్సన్ స్క్వార్ట్‌జ్ తన వాతావరణ నివేదిక ఇస్తూనే లైవ్‌లోనే కుప్పకూలిపోయింది. మార్చి 18 ఉదయం లైవ్ ఆన్-ఎయిర్ టీవీ లైవ్ షో కొనసాగుతోంది. ఆ వాతావరణ అందిస్తున్న ఆమె కుర్చుకున్న కుర్చీలో నుంచి ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో షాక్ అయ్యిన టీవీ ఛానల్ నిర్వహకులు వెంటనే ఆమెను సమీప అసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌లో మారింది. స్టీవ్ పీటర్స్ అనే వ్యక్తిట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు.


ఈ వీడియోలో KCAL న్యూస్- CBS LAకి చెందిన ఇద్దరు న్యూస్ యాంకర్లు నిచెల్ మదీనా, రాచెల్ కిమ్ తమ వార్తలను ప్రజెంట్ చేస్తున్నారు. అదే సమయంలో CBS LA వాతావరణ శాస్త్రవేత్త అలిస్సా కార్ల్‌సన్ స్క్వార్ట్‌జ్‌తో మాట్లాడటం ప్రారంభించారు. లైవ్‌లో మాట్లాడుతూనే ఆమె మూర్ఛపోయి కుర్చీలోంచి పడిపోయారు. అలిస్సా కార్ల్‌సన్ తన వాతావరణ నివేదికలో ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తునే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఛానల్ సిబ్బంది ఆమెను చికిత్స ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..