జైలు గోడలెక్కిన పిల్లి.. పట్టుకున్న పోలీసులు షాక్‌

Updated on: May 22, 2025 | 3:46 PM

మ్యావ్‌.. మ్యావ్‌ అంటూ మన కాళ్ల సందుల తిరిగే పిల్లుల గురించే మనకు తెలుసు. కానీ ఈ పిల్లి మాత్రం యమ డేంజర్‌.. ఎందుకంటే దానికి డ్రగ్స్‌ ఎలా సరఫరా చేయాలో తెలుసు. జైలు గోడులు ఎలా దూకాలి.. స్పాట్స్‌కు ఎలా చేరుకోవాలో తెలుసు. పైగా పోలీసుల కల్లుగప్పి ఎలా తప్పించుకోవాలో కూడా బాగా తెలుసు. అన్నింటికి మించీ పెద్ద జిత్తులమారి నక్క అనే బదులు జిత్తులమారి పిల్లి అనేయొచ్చు.

తాజాగా డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పోలీసులు అడ్డంగా బుక్కయింది పిల్లి. జైలు వెలుపల పెన్సింగ్‌పై పిల్లి అనుమానాస్పదంగా కనిపిండంతో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. పిల్లి శరీరంపై తెలుపు, నలుపు రంగులో ఉండే ప్యాకెట్లను టేపుతో అతికించారు. వాటిని చివరకు కత్తిరించి చూడగా, అందులో డగ్స్ బయటపడ్డాయి. ఓ ప్యాకెట్‌లో 236 గ్రాముల గంజాయి ఉండగా, మరో ప్యాకెట్‌లో 68 గ్రాముల క్రాక్ పేస్ట్‌తో పాటూ రెండు రోలింగ్ పేపర్ షీట్లు ఉన్నాయి. సెంట్రల్ అమెరికాలోని ఈశాన్య కోస్టారికా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైల్లోని ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేసేలా ఈ పిల్లికి ట్రైనింగ్ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. పిల్లిని కోస్టారికన్ నేషనల్ యానిమల్ హెల్త్ సర్వీస్‌‌ సెంటర్‌కు తరలించారు. ఈ పిల్లికి శిక్షణ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి గంజాయిని పంపిస్తున్నారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై ఖైదీలను విచారిస్తున్నారు. అయితే ఇలా పిల్లితో డ్రగ్స్‌ సరఫరా చేయించడంపై అంతా షాక్‌ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్ హాసన్

అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ..!

సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో

OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌

హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..