నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని వీడియో(Viral Video)లు చూస్తే మాత్రం కన్నీటిని తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలైతే జనాలు బాగా ఇష్టపడుతుంటారు. వైరల్ అయ్యే వీడియోలో ఎక్కువభాగం జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా నెట్టింట్లో ఓ పిల్లి(Cat) వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూస్తే మీరు కూడా దానికి పెద్ద ఫ్యాన్ అవుతారు. వీడియోలో ఓ పిల్లవాడు బోర్లా పడుకుని ఉన్నట్లు చూడొచ్చు. అయితే, ఆ పిల్లవాడి వీపుపైన ఓ పిల్లి ఎంతో చక్కగా మసాజ్ చేస్తుంది. ఈ నల్లపిల్లి శిశువును రెండు కాళ్లతో, వీపుపై ప్రేమగా మసాజ్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. అయితే, ఈ శిశువు ఎలాంటి భయం లేకుండా అలాగే పడుకుని ఉంటాడు. ఈ నల్లపిల్లి మసాజ్ ఆ పిల్లాడికి ఎంతో నచ్చినట్లుగా ఉంది. అలాగే పడుకుని సేద తీరుతున్నట్లు మనం వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోను డచ్ జంతు ప్రేమికుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. బ్యూటెంగెబిడెన్ అకౌంట్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. నా పిల్లికి మాసాజ్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ అందించారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్, 17వేల లైకులు, 2వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి.
ఇక నెటిజన్లు పలు రకాల కామెంట్లతో పిల్లిని తెగ పొగిడేస్తున్నారు. మా ఇంట్లో పిల్లి కూడా ఇలా చేస్తే బాగుండు అంటూ కొందరు కామెంట్ చేయగా, మాకు అలాంటి పిల్లే కావాలి అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ నల్లపిల్లి నెట్టింట్లో మాత్రం తెగ సందడి చేస్తోంది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Massage time.. pic.twitter.com/a6gCtPZ2lm
— Buitengebieden (@buitengebieden_) April 4, 2022
Cat massages do feel really nice.
— Cheryl Roarke (@CherylRoarke) April 4, 2022
I want one like that
— Asaf Zluf (@AsafZluf1) April 4, 2022
Also Read: Viral Video: ఈ చేపను వేటాడితే ఇక అంతే.. మొసలికి ఏం గతి పట్టిందో చూస్తే ఫ్యూజులు ఎగిరినట్లే!