కోడిగుడ్లను పొదుగుతున్న పిల్లి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సాధారణంగా కోడి గుడ్డును కానీ, కోడి పిల్లను కానీ పిల్లి చూసిందనుకోండి.. ఏం చేస్తుంది.. లటుక్కున మింగేస్తుంది. కదా... కానీ ఇక్కడ సీన్ టోటల్ రివర్స్‌లో ఉంది. ఓ పిల్లి ఏకంగా కోడిని కాదని, గుడ్లను తానే పొదుగుతుంది. గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తుంటే చూసి మురిసిపోతోంది.
సాధారణంగా కోడి గుడ్డును కానీ, కోడి పిల్లను కానీ పిల్లి చూసిందనుకోండి.. ఏం చేస్తుంది.. లటుక్కున మింగేస్తుంది. కదా… కానీ ఇక్కడ సీన్ టోటల్ రివర్స్‌లో ఉంది. ఓ పిల్లి ఏకంగా కోడిని కాదని, గుడ్లను తానే పొదుగుతుంది. గుడ్డులోంచి పిల్ల బయటకు వస్తుంటే చూసి మురిసిపోతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఒక బుట్టలాంటి దానిలో కొన్ని గుడ్లు ఉన్నాయి. వాటిని ఓ పిల్లి పొదుగుతోంది. అది పెంపుడు పిల్లి అని తెలుస్తోంది. ఇంతలో తన యజమాని వచ్చి ఒక గుడ్డును తీసుకోబోతే.. ఆమె చేతిని నెట్టేసి మరీ గుడ్డును తీసేసుకుంటుంది పిల్లి. ఆ తర్వాత ఓ గుడ్డులోంచి పిల్ల బయటకు వచ్చింది. అది చూసి ఆ పిల్లి ఎంతో మురిసిపోయింది. అలా గుడ్లనుంచి వచ్చిన పిల్లలను ముద్దాడడం, తనతోనే పడుకోబెట్టుకుని నిద్రపుచ్చడం కూడా చేసింది. అలా అవి కాస్త పెద్ద కూడా అయ్యాయి. అప్పుడు కూడా ఆ తల్లి పిల్లి వాటిని వదలకుండా వాటితోనే గడిపింది. ఇలా సాగిన ఈ వీడియో ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: కొత్త యాడ్‌లో సమంతా రచ్చ.. మామూలుగా లేదు
15 ఏళ్ల బంధానికి ముగింపు.. మరో బాలీవుడ్ జంట విడాకులు !!
Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..
Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు