Bill Gates Resume: కెరీర్ తొలినాళ్లలో ‘బిల్‌గేట్స్’ రెజ్యూమ్.. 40 ఏళ్లనాటి రెజ్యూమ్‌ను షేర్ చేసిన అపర కుబేరుడు..
చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట చేసే పని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం. తమ విద్యార్హతలు, నైపుణ్యాలను, సాధించాల్సిన లక్ష్యాలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి..
చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట చేసే పని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం. తమ విద్యార్హతలు, నైపుణ్యాలను, సాధించాల్సిన లక్ష్యాలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ అందులో పొందుపరుస్తారు. ఇక దాదాపు అన్ని సంస్థలు తమకు అనువైన అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు రెజ్యూమ్ నే మార్గంగా ఎంచుకుంటారు. ఈక్రమంలో అపరుకుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన కెరీర్ తొలినాళ్ల నాటి రెజ్యూమ్‌ను లింక్డిన్ వేదికగా పంచుకున్నారు. ‘మీరు ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులైనా, లేదా కాలేజీ చదువుల్ని మధ్యలోనే మానేసినవారైనా కానీ..మీ రెజ్యూమ్ 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే కచ్చితంగా బెటర్‌గానే భావిస్తున్నా’ అంటూ అందులో రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్‌గా మారింది.కాగా బిల్‌గేట్స్ ప్రఖ్యాత హార్వర్డ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఈ రెజ్యూమ్‌ను తయారు చేసుకున్నారు. ఇందులో ఆయన పేరు విలియం హెచ్ గేట్స్‌గా ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ కన్‌స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి కోర్సులను తాను నేర్చుకున్నట్టు తన రెజ్యూమ్‌లో పొందుపరిచారు. అంతేకాదు, అన్ని ముఖ్యమైన ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో తనకు అనుభవం ఉందని వివరించారు.1973లో టీఆర్‌డబ్ల్యూ సిస్టమ్స్ గ్రూప్‌లో సిస్టమ్ ప్రొగ్రామర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నట్టు కూడా తెలిపారు. ఇలా తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను రెజ్యూమ్‌లో తెలిపారు బిల్ గేట్స్. ప్రస్తుతం ఈ రెజ్యూమ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ రెజ్యూమ్ షేర్ చేసినందుకు థ్యాంక్సూ బిల్ గేట్స్. ఇది ఒక పర్‌ఫెక్ట్ రెజ్యూమ్. నేటి యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని యూజర్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?