120 కి.మీ వేగంతో దూసుకొచ్చిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
న్యూయార్క్ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా..
న్యూయార్క్ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. బ్రూక్లిన్‌లో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఓ కారు అతి వేగంగా గంటకు 128 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అదే సమయంలో సిగ్నల్ వద్ద ఒకవైపు నుంచి వెళ్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. అదే స్పీడ్‌తోనే ముందు ఆగిఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. అనంతరం ఫుట్‌పాత్‌పైకి వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మసాలా దోశ తెమ్మంటే..ఆ సర్వర్ ఏంచేశాడో తెలుసా ??
బాలింతను ఆడవిలో వదిలేసిన ప్రియుడు !! ఎక్కడ జరిగిందంటే ??
అందంగా అలంకరించుకుంటున్న రామచిలుక !! వీడియో చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే
భయం లేకుండా మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు !! నెట్టింట వీడియో వైరల్
భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

