ఇక నావల్లకాదు.. 24గంటల్లోనే డైవర్స్ అంటూ రచ్చ
వెర్రి వేయి విధాలు అన్నారు పెద్దలు.. ఇంకా చెప్పాలంటే ఎవరి పిచ్చి వారికీ ఆనందం అనిపించకమానదు కొందరు చేస్తున్న పనులను చూస్తే.. గత కొంతకాలంగా తమని తాము పెళ్లి చేసుకుంటున్న యువత గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం..
వెర్రి వేయి విధాలు అన్నారు పెద్దలు.. ఇంకా చెప్పాలంటే ఎవరి పిచ్చి వారికీ ఆనందం అనిపించకమానదు కొందరు చేస్తున్న పనులను చూస్తే.. గత కొంతకాలంగా తమని తాము పెళ్లి చేసుకుంటున్న యువత గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అలా తనని తాను పెళ్లి చేసుకున్న ఓ యువతి 24 గంటలు కూడా గడవకమునుపే విడాకులు తీసుకుంటానంటూ ప్రకటించింది. ఈ యువతి ప్రకటన నెట్టింట్లో ప్రస్తుతం ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. 25 ఏళ్ల సోఫీ మారీ అనే యువతి ఫిబ్రవరి 20న తన పెళ్లి విషయాన్ని ప్రకటించింది. తనను తాను పెళ్లి చేసుకోనున్నానని తెలిపింది. తెల్లటి పెళ్లి గౌను, బంగారు తలపాగా ధరించి.. పెళ్లి దుస్తులతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. “ఈ రోజు, నా జీవితంలో అత్యంత ముఖ్యమైంది. నేను నా పెళ్లి కోసం దుస్తులను కొనుగోలు చేసాను.. నన్ను నేను వివాహం చేసుకోవడానికి వెడ్డింగ్ కేక్ తయారు చేసుకున్నాను ” అని ఆమె ఫిబ్రవరి 20న ట్వీట్ చేసింది.