ఈ సూపర్‌ మార్కెట్‌లో అన్నీ ఫ్రీనే

Updated on: Nov 24, 2025 | 4:58 PM

కెనడాలో ఒక స్వచ్ఛంద సంస్థ వినూత్నమైన 'ఉచిత సూపర్ మార్కెట్లను' నిర్వహిస్తోంది. ఇక్కడ తక్కువ ఆదాయం గలవారు, విద్యార్థులు, వృద్ధులు తమకు కావలసిన నిత్యావసరాలను ఉచితంగా పొందవచ్చు. ఆకలితో ఎవరూ బాధపడకూడదనే లక్ష్యంతో నెల నెలా రూ. 40,000 విలువైన సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే, 5,500లకు పైగా ఫుడ్ బ్యాంకులు కూడా ఉచిత ఆహారాన్ని అందిస్తున్నాయి.

సాధారణంగా కొన్ని సూపర్‌ మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వీకెండ్స్‌లోనో.. మంత్‌ ఎండింగ్‌లోనో నిత్యావసర సరుకులు, వివిధ వస్తువులపై డిస్కౌంట్స్‌ ప్రకటిస్తాయి. కానీ సరుకులు మొత్తానికి ఫ్రీగా ఇవ్వడం ఎక్కడైనా చూశారా? వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ ఇస్తారేమోకానీ, మొత్తానికి ఫ్రీగా అయితే ఇవ్వరు కదా… కానీ అలాంటి సూపర్‌ మార్కెట్‌ కూడా ఉంది. అక్కడ ఎవరికి కావలసిన వస్తువులు వారు ఫ్రీగా తీసుకోవచ్చు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదనే సదుద్దేశంతో కెనడాలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఈ సూపర్ మార్కెట్లలో వస్తువులన్నీ ఉచితంగా లభిస్తాయి. తక్కువ ఆదాయం కలిగిన ఉద్యోగస్తులు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా ఎవరైనా ఈ సూపర్ మార్కెట్ కు వచ్చి తమకు కావాలసిన నిత్యావసర వస్తువులను ఉచితంగా పొందవచ్చు. అయితే, ముందుగా ఈ సంస్థలో తమ పేరు, చిరునామా, ప్రభుత్వ గుర్తింపు కార్డులతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సభ్యుడు నెలకు.. రెండు విడతలుగా సుమారు రూ.40 వేల విలువైన వస్తువులను ఉచితంగా తీసుకెళ్లే వీలు ఉంటుంది. దీనికి అదనంగా దేశవ్యాప్తంగా 700 ఫుడ్‌ బ్యాంకులను కూడా రెజీనా సంస్థ ఏర్పాటు చేసింది. ఇతరత్రా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, కెనడాలో మొత్తం 5,500ల కంటే ఎక్కువ ఫుడ్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫుడ్ బ్యాంకులలో అర్హులైన వారందరికీ ఉచితంగా ఆహారం అందిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 8 లక్షల కారులో వచ్చి.. రూ. 8 పేపర్‌ను దొంగిలించాడు

చలికాలంలో పెదవులు పలిగిపోతున్నాయా ?? ఇది మీకోసమే

ఇది పిచ్చి మొక్క కాదు.. క్యాన్సర్‌ను అరికట్టే దివ్యౌషధం

10 దేశాల మీదుగా.. 300 ఉప నదులను కలుపుకుంటూ

ఈ సమస్యలు ఉంటే బాదం జోలికి అస్సలు వెళ్లొద్దు

Published on: Nov 24, 2025 04:52 PM