Man sucide: ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. యువకుడు సూసైడ్..
పెళ్లికి నిరాకరించారని ప్రేయసో, ప్రియుడో ఆత్మహత్య చేసుకునే వార్తల్ని తరచూ చూస్తుంటాం. కర్ణాటక లోని చిక్‌మంగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమకథ వెలుగు చూసింది. ఆ ప్రేమ కథ ప్రియుడి ఆత్మహత్యతో విషాదాంతమైంది.
పెళ్లికి నిరాకరించారని ప్రేయసో, ప్రియుడో ఆత్మహత్య చేసుకునే వార్తల్ని తరచూ చూస్తుంటాం. కర్ణాటక లోని చిక్‌మంగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమకథ వెలుగు చూసింది. ఆ ప్రేమ కథ ప్రియుడి ఆత్మహత్యతో విషాదాంతమైంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చేతన్‌గా గుర్తించారు. ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. ఆ మొత్తాన్ని వసూలు చేయాలంటూ లేఖ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు చేతన్. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాల కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందంటూ స్నేహితులతో చెప్పి వాపోయేవాడు. పెళ్లి చేసుకుందామని చేతన్ ప్రతిపాదించగా ఆమె ససేమిరా అంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతని మృతదేహం వద్ద ఓ లెటర్ దొరికింది. ప్రేయసి సరదాల కోసం 4లక్షల 50వేలు ఖర్చు చేశానని..ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని పోలీసులను కోరాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

