ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై బస్సుల్లోనూ బాత్రూంలు
దూరప్రాంత బస్సు ప్రయాణాల్లో టాయిలెట్ల లేకపోవడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ తమ బస్సులో వెస్టర్న్ కమోడ్, వాష్ బేసిన్‌తో కూడిన బాత్రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మూత్ర విసర్జనకు మాత్రమే అనుమతించినా, ఇది ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సుల్లోనూ ఇలాంటి సదుపాయాలు రావాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు.
దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైళ్లనే ఎంచుకుంటారు. ఎందుకంటే అందులో బాత్రూమ్‌లు అందుబాటులో ఉంటాయి. బస్సు ప్రయాణాల్లో ఈ సౌకర్యం ఉండదు. దీంతో బస్సుల్లో ప్రయాణించేవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. బస్సు డ్రైవర్లు ఎప్పుడు ఆపితే అప్పుడు వాష్ రూంకి వెళ్లాల్సిందే. చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రయాణికులంతా ప్రయాణ సమయంలో తరచుగా డ్రైవర్‌ని వాష్ రూం కోసం ఆపమని అడగుతుంటారు. కొందరైతే మొహమాట పడి అలాగే బలవంతంగా బిగబట్టుకుని కూర్చోటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారి కోసం ఓ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ.. తమ బస్సులో బాత్రూమ్‌లు ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ముఖ్యంగా మహిళా ప్రయాణికుల ఇబ్బందులు అర్థం చేసుకొని ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు సంస్థ తమ బస్సులో బాత్రూమ్ సదుపాయం కల్పించింది. డ్రైవర్ సీటు వెనుక భాగంలో వెస్టర్న్ కమోడ్, ముఖం కడుక్కోడానికి వీలుగా వాష్ బేసిన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మూత్ర విసర్జనకు మాత్రమే ఈ బాత్రూమ్‌లను అనుమతిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి సదుపాయం వస్తే బాగుండని బస్సు ప్రయాణికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్‌కు కోమటిరెడ్డి కౌంటర్.. ముదురుతున్న వివాదం
TOP 9 ET News: అఖండ-2 లో సీనియర్ ఎన్టీఆర్ ??
Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కాస్ట్.. ఎన్ని కోట్లో తెలుసా ??
