Bumper offer: రూ.1కే పట్టుచీర.. కిలోమీటర్ల మేర క్యూకట్టిన జనం.. ఎక్కడంటే..?

Updated on: Sep 17, 2022 | 9:32 AM

ఆడవాళ్లకు పట్టుచీరలన్నా, నగలన్నా చెప్పలేనంత ఇష్టం. వాటిని దక్కించుకోడానికి భర్తలతో కుస్తీ పట్టడానికి కూడా వెనుకాడరు. అలాంటిది ఒక్కరూపాయికే పట్టు చీర ఇస్తాం.. కొందరికైతే


ఆడవాళ్లకు పట్టుచీరలన్నా, నగలన్నా చెప్పలేనంత ఇష్టం. వాటిని దక్కించుకోడానికి భర్తలతో కుస్తీ పట్టడానికి కూడా వెనుకాడరు. అలాంటిది ఒక్కరూపాయికే పట్టు చీర ఇస్తాం.. కొందరికైతే ఫ్రీగానే ఇస్తాం అంటే.. చూస్తూ ఊరుకుంటారా… ఎక్కడి వంటలు అక్కడ వదిలేసి ఆ దుకాణానికి లగెత్తరూ… సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన శ్రీ వెంకటేశ్వరా సిల్క్స్ షోరూం…రూపాయికే పట్టుచీర అంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. షో రూమ్ ప్రారంభించి సంవత్సరం పూర్తి కావడం తో తమ షో రూమ్ కి వచ్చే కస్టమర్ల కోసం ఈ ఆఫర్ ప్రకటించారు. ఇక ఆటో డ్రైవర్లకు అయితే ఉచితంగా పట్టు వస్త్రాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. వీటితో పాటు చాలా ఆఫర్స్ ఉన్నాయని పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం తో షో రూమ్ ముందు మహిళలు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఆటో డ్రైవర్లు కూడా ఉచితంగా ఇస్తున్న బట్టలు తీసుకోవడానికి పోటీపడ్డారు. పోలీసులు ఎంత వారించినా మహిళలను కంట్రోల్ చేయలేకపోయారు. పట్టు చీరలకోసం ఉదయం నుంచే మహిళలు పడిగాపులు కాయడం, షో రూమ్ తెరవగానే ఒక్కసారిగా మహిళలు లోపలికి వెళ్ళడానికి పోటీపడడంతో పలువురికి గాయాలయ్యాయి. వాటిని కూడా లెక్క చేయకుండా చీరల కోసం ప్రయత్నించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 17, 2022 09:32 AM