Buffello attack: అమ్మాయి ముందు హీరో అవ్వాలని ఆట పట్టిద్దామనుకున్నారు.. రివర్స్‌లో కుమ్మి పడేసింది..
ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత ఎక్కడ ఏంజరిగినా నెట్టింట క్షణాల్లో ప్రత్యక్షమైపోతోంది. ఈ క్రమంలో ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ నెటిజన్లకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మనం గ్రామాల్లో చూస్తూనే ఉంటాం.
ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత ఎక్కడ ఏంజరిగినా నెట్టింట క్షణాల్లో ప్రత్యక్షమైపోతోంది. ఈ క్రమంలో ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ నెటిజన్లకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మనం గ్రామాల్లో చూస్తూనే ఉంటాం. రోడ్డుపైన గేదెలు, ఆవులు, ఎద్దులు వెళ్తున్నప్పుడు కొందరు సరదాగా వాటిని ఆటపట్టిస్తుంటారు. కొన్ని సాధు జంతువులైతే తలవంచుకొని వెళ్లిపోతాయి. కొన్నిటికి మాత్రం ఇగో ఉంటుంది. అవి వెంటనే వారిపై ఎటాక్ చేస్తాయి. ఇదిగో ఇక్కడ కూడా అలగే జరిగింది. ఓ గేదెను ఆటపట్టిద్దామనుకున్న యువకులకు చుక్కలు చూపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో బైక్ పై వెళ్తున్న ఆకతాయిలు.. అటుగా వెళ్తున్న గేదెను ఆటపట్టించాలనుకున్నారు. దాని ముందు బైక్‌ను రైజ్‌చేస్తూ దానికి చిరాకు తెప్పించారు. అంతే వెంటనే అది రెచ్చిపోయి.. నన్నే ఆటపట్టిస్తారా అంటూ.. వారిని వెంబడించి, వెంబడించి కింద పడేసింది. ఊహించని ఈ పరిణామానికి ఆ యువకులు విస్తుపోయారు. దెబ్బకు బండి అక్కడే వదిలేసి ఉడాయించారు. అనంతరం..అట్లుంటది మనతోని అన్నట్లు అక్కడ్నుంచి వెళ్లిపోయింది ఆ గేదె. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒకటే నవ్వుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos