Viral Video: వికారాబాద్‌లో వింత ఘటన.. రెండుతలలతో గేదెదూడ జననం.. వీడియో

|

Sep 30, 2021 | 9:36 PM

వికారాబాద్‌లో వింత ఘటన జరిగింది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.

వికారాబాద్‌లో వింత ఘటన జరిగింది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. బషీరాబాద్‌ మండలం జీవన్గి గ్రామంలో సెప్టెంబర్ 24న ఓ గేదె దూడకు జన్మనివ్వగా అది రెండు తలలతో జన్మంచింది. గ్రామానికి చెందిన వీరారెడ్డికి ఉన్న పశువుల్లో ఓ గేదె ఈతకు ఇబ్బంది పడుతుంటే పశువైద్యుడికి సమాచారం అందించాడు. వైద్యుడు వచ్చి గేదెను పరీక్షించి కడుపులో రెండు తలలున్న దూడ ఉందని గ్రహించి, జాగ్రత్తగా దూడను కడుపులోంచి తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రెండు తలలున్న దూడను చూసేందుకు తరలి వస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ప్రాణాలు తీసిన అతివేగం.. ఒళ్ళు గగ్గురుపొడిచే యాక్సిడెంట్.. వీడియో వైరల్

Big News Big Debate: తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలు.. లైవ్ వీడియో