Chilli Ice Cream: చిల్లీ ఐస్ క్రీం తిన్న బ్రిటీష్ హైకమీషనర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
భారతీయులు ఆహార ప్రియులు. విభిన్న రుచులతో కూడిన ఇండియన్ వంటకాలను విదేశీయులు కూడా అత్యంత ఇష్టంగా తింటారు. ఇటీవల, బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్...
భారతీయులు ఆహార ప్రియులు. విభిన్న రుచులతో కూడిన ఇండియన్ వంటకాలను విదేశీయులు కూడా అత్యంత ఇష్టంగా తింటారు. ఇటీవల, బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ..రోడ్‌సైడ్ ఫుడ్ ను రుచి చూశారు. ఫేమ్ స్నాక్స్‌ను ఆస్వాదించారు. రుచికరమైన స్నాక్స్‌ను ఆస్వాదిస్తూ రెండు ఫోటోలను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘ఈ రోజు నేను ముంబై వాసిలా మారిపోయాను.. వారిలానే ఆహారాన్ని తింటున్నాను . తాను ముంబై శాండ్‌విచ్, చిల్లీ ఐస్ క్రీం టేస్ట్ చేశానని ఫోటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో బ్రిటిష్ హైకమిషనర్ ముంబై లోని ఫేమస్ శాండ్‌విచ్, చిల్లీ ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్నారు. అతను క్యాప్షన్‌లో మరాఠీ పదాలను కూడా ఉపయోగించారు. తినడానికి రండి అంటూ అందరిని ఆహ్వానించారు అలెక్స్. ఈ పోస్ట్‌ను 1 లక్షమందికి పైగా వీక్షించగా… 2 వేలమంది లైక్ చేశారు. అంతేకాదు కొంతమంది నెటిజన్లు.. ముంబైలో ఇంకా ఏయే ఫుడ్ తినవచ్చో సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..