అక్క పెళ్లి.. చెల్లెలు డాన్స్‌.. ఇరగదీసిందంటున్న నెటిజనం..!

అక్క పెళ్లి.. చెల్లెలు డాన్స్‌.. ఇరగదీసిందంటున్న నెటిజనం..!

Phani CH

|

Updated on: Jun 07, 2022 | 8:46 AM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. జూన్‌ తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు భారీగానే జరుగుతున్నాయి.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. జూన్‌ తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు భారీగానే జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఎన్నో వేడుకలకు దూరమైన ప్రజలు ఇప్పుడు సామాన్య పరిస్థితులకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లు ఓ రేంజ్‌లో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వివాహ వేదికపై వధువు సోదరి చేసిన డాన్స్‌కు స్టేజ్‌ అదిరిపోయింది. ఈ వీడియోను ఓ యూజ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. ఇందులో వధువు సోదరి గోల్డెన్ క‌ల‌ర్‌ లెహంగా ధరించి, ‘అత్రంగి రే’ సినిమాలోని ‘చకా చక్’ పాటపై అదిరిపోయే స్టెప్పులేసింది. ఆమె డ్యాన్స్ చూసి అక్కడున్నవారంతా చ‌ప్పట్లతో అభినందించారు. ఈ వీడియోను వేలమంది నెటిజన్లు వీక్షిస్తూ కామెంట్లతో, ల‌వ్ ఎమోజీలతో..వావ్‌.. అద్భుతం అంటూ హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి కాళ్లు పట్టుకున్న అబ్బాయి !! పాపం.. అందరిలో బిస్కెట్‌ అయ్యాడు

పాములే.. పాములు.. కుప్పలు తెప్పలుగా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే !!

రూ.19 లక్షలతో చెత్త కొన్నాడట.. కారుకు బ్యానర్ చూసి షాక్ అవుతున్న జనం

 

Published on: Jun 07, 2022 08:46 AM