ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటుచేసుకుంది. అనంతపురంకి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్నతాంబులం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో నాలుగు గంటలకు గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోయింది. కొన్ని గంటలలో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లి కుమార్తె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు కళ్యాణ మండపం నుండి ఒక అబ్బాయితో వెళ్ళిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. జరగాల్సిన పెళ్లి ఒక్కసారిగా నిలిచిపోవడంతో అటు పెళ్లికూతురు , అటు పెళ్లికూతురు ,ఇటు పెళ్లి కుమారుడు బంధువులు నిరుత్సాహ గా ఉండిపోయారు. ఏమైనా ఉంటే పెళ్లికి ముందే చూసుకోవాలని ఇలా పెళ్లి ఆపడం మంచిపద్దతి కాదని అబ్బాయి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుత్సాహంగా తిరిగి వెళ్లిపోయారు వరుడి తరపు బంధువులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది
అంతరిక్ష యాత్రకు రెడీనా ?? టికెట్ ధర రూ. 1.77 కోట్లు మాత్రమే
తండ్రి వెనుక కూర్చోగా స్కూటర్ నడుపుతున్న బాలిక !! మండిపడుతున్న నెటిజన్లు