AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Matrimonial Ad:పెళ్లికొడుకు యాడ్‌ వైరల్‌.. బాబోయ్‌.. ఇన్ని అర్హతలా..! ఇదే అబ్బాయిలు కోరితే ఎన్ని విమర్శలో..

Matrimonial Ad:పెళ్లికొడుకు యాడ్‌ వైరల్‌.. బాబోయ్‌.. ఇన్ని అర్హతలా..! ఇదే అబ్బాయిలు కోరితే ఎన్ని విమర్శలో..

Anil kumar poka
|

Updated on: Oct 27, 2022 | 9:57 AM

Share

కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూసే తల్లిదండ్రుల్లో అబ్బాయి గురించి కొన్ని అంచనాలుంటాయి. కుటుంబం, చదువు, ఉద్యోగం, జీతం.. వంటివి ఇలాగే ఉండాలని ఓ అభిప్రాయం ఉంటుంది. ఇదే తరహాలో ఇచ్చిన ఓ మ్యాట్రిమోనియల్ యాడ్‌ నెట్టింట్లో చర్చకు దారితీసింది.


వరుడు గురించి ఆ ప్రకటనలో వధువు కుటుంబం కొన్ని డిమాండ్లను ఏకరవు పెట్టింది. ‘వరుడు ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలి. ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్‌, పీజీడీఎంలో ఏదో ఒకదానిలో డిగ్రీ ఉండాలి. ఒకవేళ ఇంజినీర్ అయితే.. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు, బిట్స్‌ పిలానీ, ఎన్‌ఐటీ వంటి వాటిల్లోనే ఆ పట్టా పొంది ఉండాలి. ఎంబీఏ అయితే.. ఐఐఎం, ఐఎస్‌బీల్లోనే పూర్తి చేసుండాలి. కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తుండాలి. వార్షికాదాయం 30 లక్షల రూపాయలకు తగ్గకూడదు. 1992 తర్వాత జన్మించిన వారే అర్హులు. అబ్బాయి ఎత్తు ఐదు అడుగుల ఏడు అంగుళాల నుంచి ఆరడుగుల మధ్యలో ఉండాలి. చిన్న కుటుంబం, చదువుకున్న కుటుంబం అయితే ఇంకా బెటర్’ అంటూ అబ్బాయికి ఉండాల్సిన అర్హతల చిట్టాను రాసుకొచ్చింది.దీనిపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ‘ఆమె.. భర్తను నియమించుకుంటుందా..?’, ‘ఇదే తరహాలో ఓ అబ్బాయి జాబితా పెట్టి ఉంటే.. విమర్శలు ఏస్థాయిలో ఉండేవో..?’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.