Viral Video: తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో ఖంగుతిన్న వరుడు షాకింగ్ నిర్ణయం.. అంతా కొలాప్స్..
అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ జంట పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. పెద్దలు వారి కొత్త ప్రయాణం బాగుండాలని ఆశీర్వదించారు. ఫ్రెండ్స్ సరదాగా కాసేపు ఆట పట్టించారు. పెళ్లి తంతు అంతా బాగా ముగిసింది. అయితే తొలిరాత్రి రోజున ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకోవాలనుకున్నారు.
అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ జంట పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. పెద్దలు వారి కొత్త ప్రయాణం బాగుండాలని ఆశీర్వదించారు. ఫ్రెండ్స్ సరదాగా కాసేపు ఆట పట్టించారు. పెళ్లి తంతు అంతా బాగా ముగిసింది. అయితే తొలిరాత్రి రోజున ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకోవాలనుకున్నారు. లైఫ్‌లో ఎదురైన అన్ని అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే వధువు చెప్పిన ఒక విషయం విన్న వెంటనే వరుడు నిర్ఘాంతపోయాడు. దీంతో అతడి ముఖంలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. అంతేకాదు వారి వైవాహిక బంధానికి కూడా అక్కడే స్టాప్ పడింది. 2 కుటుంబాల్లో అప్పటివరకు ఉన్న సంతోషం పోయి దు:ఖం ఆవరించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది.తన లైఫ్‌లోని మంచి, చెడు అనుభవాలను భర్తతో పంచుకుంటున్న సమయంలో యువతి.. గతంలో తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. ఈ విషయం తెలిసిన వెంటనే కంగుతిన్న భర్త.. వెంటనే ఆ వివాహాన్ని రద్దు చేసుకోవాలని భావించాడు. తాను ఆమెను భార్యగా స్వీకరించలేనని స్పష్టంగా చెప్పేశాడు. మరుసటి రోజే యువతిని ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఇరువైపుల బంధుమిత్రులకు ఈ విషయం తెలియడంతో షాక్‌కు గురయ్యారు. తనపై అత్యాచారానికి పాల్పడింది మేనమామ కొడుకేనని ఆమె అందరితో చెప్పింది. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ భర్త కోర్టు మెట్లు ఎక్కాడు. యువకుడి అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అయితే నోటీసులు మీద నోటీసులు ఇచ్చినా అతని భార్య కోర్టులో అటెండ్ అవ్వలేదు. ఇలా మూడేళ్ల పాటు సాగిన విచారణకు ఎండ్ కార్డు వేస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చింది. యువకుడు కోరిన విధంగా 2019లో జరిగిన ఆ వివాహాన్ని రద్దు చేసింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..