గంటలో పెళ్లి.. గుండెపోటుతో వధువు మృతి.. అయినా ఆగని వివాహం !!
కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి చెందింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని..
కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి చెందింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని.. ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మృతి చెందిన కుమార్తె స్థానంలో ఆమె చెల్లినిచ్చి వివాహం జరిపించారు. అచ్చం సినిమా సీన్‌లా జరిగిన సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. భావ్‌నగర్ జిల్లా సుభాశ్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాఠోడ్ పెద్ద కుమార్తె హేతల్‌కు నారీ గ్రామానికి చెందిన విశాల్‌భాయ్‌తో వివాహం జరగాల్సి ఉంది. విశాల్‌భాయ్ ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలోనే హేతల్ స్పృహతప్పి పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి జరగాల్సిన రోజే వధువు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం అలముకుంది. ఇలాంటి పరిస్థితిలోనూ మృతురాలి కుటుంబం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

