Bride in Wedding: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లిరోజు సాహసం చేసిన నవ వధువు..! వీడియో వైరల్..

Edited By:

Updated on: Jan 17, 2023 | 9:00 AM

చాలా మంది తమ పెళ్లి రోజు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. పెళ్లిళ్లు కూడా అందరికీ గుర్తుండిపోయేలా డిఫరెంట్‌గా జరుపుకుంటారు. అయితే ఒక వధువు తన వివాహ


చాలా మంది తమ పెళ్లి రోజు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. పెళ్లిళ్లు కూడా అందరికీ గుర్తుండిపోయేలా డిఫరెంట్‌గా జరుపుకుంటారు. అయితే ఒక వధువు తన వివాహ సమయంలో తన జుట్టును కత్తిరించుకుంది. ఇందుకు ఆ పెళ్లికూతురు చెప్పిన రీజన్ విని ముందు కంగారుపడ్డా.. తర్వాత శభాష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. క్యాన్సర్ రోగుల కోసం పెళ్లికూతురు తన జుట్టును దానం చేసింది. ఆమె క్యాన్సర్‌తో తన తల్లిని కోల్పోయింది. అప్పుడు తల్లి పడిన బాధను గుర్తు చేసుకుని వధువు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్యాన్సర్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు జుట్టు. ఆ బాధ తనకు తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానంటోంది నవవధువు. ఆమె తన జుత్తునిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ.. కన్నీరు పెట్టుకున్నారు. వరుడు కూడా వధువు నిర్ణయాన్ని గౌరవించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.