Wedding Viral Video: వరమాలతో వచ్చిన వరుడు, పూలదండ చూసి పారిపోయిన వధువు..!

|

Jun 21, 2022 | 6:37 PM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తుండటంతో వివాహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. పెళ్లంటేనే బంధుమిత్రుల ఆటపాటలతో ఎంతో సరదాగా సందడిగా ఉంటుంది. ఇక అలాంటి సన్నివేశాలు జీవితాంతం గుర్తుండేలా


ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తుండటంతో వివాహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. పెళ్లంటేనే బంధుమిత్రుల ఆటపాటలతో ఎంతో సరదాగా సందడిగా ఉంటుంది. ఇక అలాంటి సన్నివేశాలు జీవితాంతం గుర్తుండేలా మరింత రక్తి కట్టిస్తున్నారు నేటితరం వధూవరులు.. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వీక్షిస్తున్న వేలాదిమంది నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియలో పెళ్లి వేదికపై అందమైన పెళ్లి దుస్తుల్లో వధూవరులిద్దరూ నిల్చొని ఉన్నారు. వరుడు వధువు మెడలో వరమాల వేసేందుకు సిద్ధమయ్యాడు. అది చూసి వధువు దూరంగా పారిపోయింది. దాంతో అలిగిన వరుడు వధువు వైపు చూస్తూ ఏదో సైగ చేశాడు. దాంతో వెంటనే పరుగెత్తుకొచ్చి వరుడిచేత వరమాల వేయించుకుంది. వధువు మెడలో వరమాలవేసి, ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆమె నుదుటన ముద్దు పెట్టాడు వరుడు. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇంటర్నెట్‌లో ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్‌ చేస్తున్నారు. షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 21, 2022 06:37 PM