సాలీడు కాటుతో అలర్జీతో ముఖం ఉబ్బిపోయి గాయం నల్లగా మారిన వైనం..
బ్రెజిల్ దేశంలో సాలీడు కాటుకు ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ సింగర్ డార్లిన్ మోరైస్ను ఇటీవల సాలీడు కాటేసింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మోరైస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచాడు. ముఖంపై సాలీడు కుట్టడంతో మోరైస్ చనిపోయాడని అతని భార్య జులినీ లిస్బోవా తెలిపింది. సాలీడు కుట్టిన వెంటనే మోరైస్ శరీరంలో నిస్సత్తువ ఆవహించిందని ఆ తర్వాత ముఖం ఉబ్బిపోయిందని మోరైస్ భార్య జులినీ లిస్బోవా తెలిపింది.
బ్రెజిల్ దేశంలో సాలీడు కాటుకు ప్రముఖ గాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ సింగర్ డార్లిన్ మోరైస్ను ఇటీవల సాలీడు కాటేసింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మోరైస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచాడు. ముఖంపై సాలీడు కుట్టడంతో మోరైస్ చనిపోయాడని అతని భార్య జులినీ లిస్బోవా తెలిపింది. సాలీడు కుట్టిన వెంటనే మోరైస్ శరీరంలో నిస్సత్తువ ఆవహించిందని ఆ తర్వాత ముఖం ఉబ్బిపోయిందని మోరైస్ భార్య జులినీ లిస్బోవా తెలిపింది. గాయం కూడా నల్లగా మారిపోయి అలర్జీ వచ్చిందని దాంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని పేర్కొంది. చికిత్స అనంతరం ఈనెల 3న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని కానీ మోరైస్ పరిస్థితి మెరుగు కాకపోవడంతో తిరిగి ఆదివారం పల్మాస్ జనరల్ ఆస్పత్రికి తరలించారనీ మోరైస్‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మృతిచెందినట్లు చెప్పింది. 18 ఏళ్ల మోరైస్ సవతి కూతురుని కూడా సాలీడు కుట్టిందని, అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని జులినీ తెలిపింది. దీనిపై మోరైస్ కుటుంబం ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anand Mahindra: ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఆనంద్ మహీంద్రా సలహా
Balakrishna: ఎవరైనా నన్ను అలా పిలిస్తే.. వాళ్లుకు ఇక దబిడదిబిడే..
Jigarthanda DoubleX: జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ.. హిట్టా ?? ఫట్టా ??
Ala Ninnu Cheri: ‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ కోసం ఈ వీడియో చూడాల్సిందే
Japaan: కార్తీ జపాన్ మూవీ హిట్టా ?? ఫట్టా ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

