ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. తర్వాత ??
ప్రేమకోసం ఎంత దూరమైనా వెళ్తారు కొందరు. తమ ప్రేమను దక్కించుకోడానికి ఎంతటి సాహసమైనా చేస్తారు. తాజాగా ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్నాడు.
ప్రేమకోసం ఎంత దూరమైనా వెళ్తారు కొందరు. తమ ప్రేమను దక్కించుకోడానికి ఎంతటి సాహసమైనా చేస్తారు. తాజాగా ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అర్ధరాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లాడు. ప్లాన్ బెడిసికొట్టడంతో బావిలో దూకేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే… బిహార్ ఛాప్రా జిల్లా మోతీరాజ్‌పూర్‌కు చెందిన మున్నారాజ్ అనే వ్యక్తి తను ప్రేమించిన యువతిని కలుసుకునేందుకు యువతి ఇంటికి వెళ్లాడు. అదికూడా అర్ధరాత్రి వేళ. ఆ రాత్రి వేళ ఆ ఇంట్లో ప్రేయసి జాడ కనుక్కునే క్రమంలో యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. రాత్రివేళ శబ్దాలు రావడంతో ఇంట్లోకి ఎవరో చొరబడ్డారని భావించిన యువతి కుటుంబ సభ్యులు లేచి చూశారు. దాంతో మున్నారాజ్ వాళ్లకంటపడ్డాడు. వాళ్లను చూసి పారిపోబోయాడు మున్నారాజ్. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు అతని వెంటపడ్డారు. దాంతో వాళ్లబారినుంచి తనను తాను కాపాడుకోడానికి మున్నారాజ్ దగ్గర్లోని బావిలోకి దూకేసాడు. అనంతరం ఘటనపై పంచాయితీ పెట్టారు యువతి కుటుంబ సభ్యులు. గ్రామ పెద్దలు ఇరు కుటుంబాలతో మాట్లాడి మున్నారాజ్‌కు తన ప్రేయసినిచ్చి గుడిలో వివాహం జరిపించారు. అలా మున్నారాజ్ ప్రేమకథ సుఖాంతమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Namrata Shirodkar: ‘ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది’ నమ్రత ఎమోషనల్ !!
Shah Rukh Khan: చరణ్‌పై షారుఖ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!
Jabardasth Vinod: దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్య పరిస్థితి !!
Namrata Shirodkar: ‘మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం’