Namrata Shirodkar: ‘ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది’ నమ్రత ఎమోషనల్ !!
బయటికి ఎప్పుడూ గుంభనంగా కనిపించే నమ్రత.. మొట్టమొదటి సారిగా ఓ ఇంటర్య్వూలో ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యామిలీ గురించి.. మాట్లాడుతున్న క్రమంలో..
బయటికి ఎప్పుడూ గుంభనంగా కనిపించే నమ్రత.. మొట్టమొదటి సారిగా ఓ ఇంటర్య్వూలో ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యామిలీ గురించి.. మాట్లాడుతున్న క్రమంలో.. తన బాబు గౌతమ్ గురించి చెబుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు తమ జీవితాల్లో చాలా భయానకమైనదంటూ కోట్ చేశారు. “ఒక తల్లిగా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. గౌతమ్ పుట్టిన రోజుని మేము ఎప్పటికీ మర్చిపోలేం. అది మా జీవితాల్లో ఓ భయానకమైన సమయం. ఏడో నెలలో చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాను. బాబు పేగు మెడలో వేసుకున్నాడని.. ఊపిరి తీసుకోలేకపోతున్నాడని, హార్ట్ బీట్ సరిగా లేదని వైద్యులు చెప్పారు. మహేష్ కు ఫోన్ చేశారు. మహేష్ ఆ సమయంలో హైదరాబాద్ ఫిలింసిటీలో ఓ షూట్ లో ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి వచ్చారు. సర్జరీ చేసి బాబును బయటకు తీశారు. అప్పుడు తను 1.5 కేజీలు మాత్రమే ఉన్నాడు. బాబు విషయంలో మేము ఏం చెప్పలేమని వైద్యులు మహేష్ కు ముందే చెప్పేశారు. మూడు వారాలపాటు బాబుని వైద్యుల సంరక్షణలోనే ఉంచాం. రోజుకు కేవలం 40 గ్రాములు మాత్రమే పాలు పట్టించాలని..ప్రతి రోజూ 10 గ్రాముల బరువు పెరగాలని సూచించారు. ప్రతి రోజు నిద్రపోయే ముందు గౌతమ్ బరువు పెరగాలని దేవుడ్ని కోరుకునేవాళ్లం. గౌతమ్ ఇప్పుడు ఇలా ఉన్నాడంటే అందుకు వైద్యులే కారణం ” అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు నమ్రత..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: చరణ్‌పై షారుఖ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!
Jabardasth Vinod: దారుణంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్య పరిస్థితి !!
Namrata Shirodkar: ‘మహేష్, నేను పెళ్ళికి ముందే ఒక డీల్ చేసుకున్నాం’
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

