Boyfriend – Girlfriend: న్యూడ్ వీడియోతో స్నేహిరాలిని బ్లాక్‌మెయిల్.. డబ్బులు డిమాండ్ చేయబోయి..!

|

Oct 02, 2022 | 6:54 PM

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. స్నేహమంటే ఓ నమ్మకం, స్నేహం కోసం ఏది చేయడానికైనా రెడీ అయిపోతారు. అదే స్నేహితులు మోసం చేస్తే అసలు తట్టుకోలేరు...


మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. స్నేహమంటే ఓ నమ్మకం, స్నేహం కోసం ఏది చేయడానికైనా రెడీ అయిపోతారు. అదే స్నేహితులు మోసం చేస్తే అసలు తట్టుకోలేరు. తమ కష్ట, సుఖాలను స్నేహితులతోనే చెప్పుకుంటారు. కాని మరికొంతమంది తమ అవసరాల కోసం స్నేహితులనే కాదు ఎవరినైనా మోసం చేయడానికి వెనుకాడరు. తాజాగా తమతో చదువుకునే ఓ స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుదామనుకున్న యువకుల ప్లాన్ బెడిసికొట్టడంతో కటకటాల పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని గోవింద్‌పురా ప్రాంతంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఓ విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాత్రూంలోకి వెళ్లి దుస్తులు మార్చుకొంటున్న ఒక విద్యార్థినిని ఆమె తోటి విద్యార్థులు వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియో చూపించి ఆమె నుంచి 7 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తమ కుమార్తె కనబడటం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ అమ్మాయిని భోపాల్ రైల్వే స్టేషన్ లో గుర్తించారు. ఆ అమ్మాయిని విచారించగా తెర వెనకు కథంతా బయటకు వచ్చింది. విషయం పోలీసులకు తెలియడంతో వీడియో తీసిన యువకుల్లో ఒకరిని అరెస్టు చేసి, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 02, 2022 06:54 PM