22 ఏళ్లకు సొంతింటికి తిరిగొచ్చిన కొడుకు.. అంతలోనే ట్విస్ట్
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. దాదాపు పదకొండేళ్ల వయస్సులో తండ్రి మందలించడంతో ఇల్లు వదిలివెళ్లిన కుమారుడు పింకు 22 ఏళ్ల తర్వాత తిరిగిరావడంతో కన్నవాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అయితే అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు కన్నకొడుకు. ఏం జరిగిందంటే.. ఢిల్లీలో నివసించే రతీపాల్ సింగ్, భానుమతిల కుమారుడు 11 ఏళ్ల వయసులో తండ్రి మందలించడంతో క్షణికావేశంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎంతవెతికినా అతని ఆచూకీ లభించలేదు.
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. దాదాపు పదకొండేళ్ల వయస్సులో తండ్రి మందలించడంతో ఇల్లు వదిలివెళ్లిన కుమారుడు పింకు 22 ఏళ్ల తర్వాత తిరిగిరావడంతో కన్నవాళ్ల ఆనందానికి అవధుల్లేవు. అయితే అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు కన్నకొడుకు. ఏం జరిగిందంటే.. ఢిల్లీలో నివసించే రతీపాల్ సింగ్, భానుమతిల కుమారుడు 11 ఏళ్ల వయసులో తండ్రి మందలించడంతో క్షణికావేశంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎంతవెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎప్పటికైనా రాకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు. అంతలో వారి ఆశలు ఫలించి 22 ఏళ్ల తరువాత అమేథిలోని ఖరౌలి గ్రామానికి వచ్చాడు పింకు. పరుగున పరుగున వచ్చిన కన్నవాళ్లు పింకూ శరీరంపై ఉన్న మచ్చను చూసి పింకూని గుర్తుపట్టారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సన్యాసిలా మారిపోయిన తమ కుమారుడి పరిస్థితి చూసి ఆవేదనకు లోనయ్యారు. సన్యాసిగా మారిన పింకూ జానపద కథలు ;చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కాలం గడిపినట్లు తెలిసింది. చివరికి పుట్టిన ఊరును, కన్నతల్లిని వెతుక్కుంటూ వచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2050 నాటికి.. తాగు నీటికి కటకటే.. కనీసం 300 కోట్ల జనాభాపై ప్రభావం పడే అవకాశం
ట్రెక్కింగ్ చేస్తూ ఇద్దరి మృతి.. 48 గంటల పాటు శునకమే కాపలా
అక్కడ అందరూ రిచ్.. ఒక్కొక్కరూ రూ. కోటి సంపాదిస్తారు