స్కూలుకి వెళ్లనని చిన్నారి మారాం.. పేరెంట్స్ ఏం చేశారో చూడండి
కొందరు చిన్నారులు స్కూలుకు వెళ్లేందుకు అస్సలు ఇష్టపడరు. అలాంటివారిని స్కూలుకు పంపడం తల్లిదండ్రులకు ఓ సవాలే. పేరెంట్స్‌ను ముప్పు తిప్పలు పెడుతుంటారు. అలా ఓ బాలుడు స్కూలుకు వెళ్లనని మారం చేస్తూ ఇంట్లోని నవారు మంచం మీద పడుకొని మొండికేశాడు. దాంతో.. విసిగిపోయిన కుటుంబ సభ్యులు మంచంతో సహా బాలుడిని తీసుకెళ్లి స్కూల్లో వదిలారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఆ బాలుడ్ని ఎలాగోలా స్కూలుకి పంపడానికి తల్లి రెడీచేసింది. కానీ మళ్లీ వెళ్లి ఆ పిల్లవాడు మంచంపైన పడుకున్నాడు. ఎంత చెప్పినా వినలేదు. ససేమిరా స్కూలుకి వెళ్లనన్నాడు. బాలుడ్ని మంచం దింపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బాలుడు బల్లిలా మంచానికి అతుక్కుపోయి..కాళ్లతో గట్టిగా పట్టుకున్నాడు. వీళ్లుకూడా తగ్గలేదు. అలాగే పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్లారు. ఇదంతా చూసి స్కూల్ లోపలకు వెళ్తున్న ఇతర విద్యార్థులు నవ్వుకున్నారు. మరోవైపు ఆ బాలుడ్ని మంచం పట్టు నుంచి వదిలించేందుకు ఓ టీచర్ కూడా ప్రయత్నించాడు. అయినా ఆ బాలుడు తన పట్టు వీడలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఆదుకునేవాడే రామ్ చరణ్
విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే ??
The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?
